ఇండియాకు బై బై చెప్ప‌నున్న హార్లే డేవిడ్సన్

అమెరికన్ లక్సరీ మోటార్ సైకిల్ సంస్థ అయినా హార్లే డేవిడ్సన్ భారత దేశ మార్కెట్ కి బై బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక మార్కెట్ల పైన ద్రుష్టి పెట్టాలన్నసంస్థ నిర్ణయంతో ఈ ఊహాగానాలకు తావునిస్తున్నాయి. భారత్ లో ఆశించిన మేర మార్కెట్ జరగకపోవటం తో భారత్ కు బై చెప్పే అవకాశాలు వున్నాయి. పెట్టుబడులకు తగ్గ వ్యాపారం జరగపోవటం కూడా ఇందుకు కారణం. కాగా హర్యానాలో వున్నా ప్లాంట్ ను వేరే సంస్థలకు ఇచ్చే ఆలోచనలో వున్నా సంస్థ. ఐతే గత ఆర్థిక సంవత్సరానికి 2019-20 సంస్థ 2500 బైకులను అమ్మినట్టు తెలుస్తుంది. ఈ గడిచిన సంవత్సరం లో ఏడు 87 శాతానికి పడిపోయింది. సంస్థకు దేశవ్యాప్తంగా 29 డీలర్ షిప్‌లు ఉన్నాయి.