పూజారులను బెదిరిస్తున్న పోలీసులు : మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం
తెలంగాణలో వినయాకచవితి ఉత్సవాలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం. హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్విహించుకునే ఈ పండగను అడ్డుకోవడమే తెరాస ముఖ్య లక్ష్యమని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా గణనాధులను ప్రతిష్టించకుండా చూడాలనే ఉద్దేశ్యంతో పోలీసులు ఆరాచకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పూజారులను,టెంట్ హౌస్ వ్యాపారులను బెదిరిస్తున్నారని, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని భయభ్రంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. హిందువులను కించపరిచే విధంగా చేయడం సరికాదన్నారు. ప్రజలు కనీస విగ్రహాలు ఏర్పాటు చేసి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఏమైన ప్రతి ఘనలు ఎదురైతే తాము చూసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.











