గణేష్ ఉత్సవాలను ఎలా అడ్డుకుంటారు : అరుణా రెడ్డి

గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం సరికాదని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అరుణా రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలలో కోవిడ్ నిబంధనలను పాటించి సక్రమంగా జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి అసలు ఉత్సవాల వద్దనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం హిందూ సంప్రదాయాలను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. ప్రజలందరూ సాంప్రదాయాలను మర్చిపోకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆమె అన్నారు. ఈ సమావేశంలో బిజెపి మహిళా మోర్చా నాయకులు లలిత, పద్మ, లక్ష్మి ,జ్యోతి, విజయ తదితరులు పాల్గొన్నారు.