ప్రపంచ వ్యాప్తంగా జీ మెయిల్ ఇబ్బందులు అందుకేనా

దేశవ్యాప్తంగా ఉన్న జీమెయిల్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీమెయిల్ సర్వీస్ ప్రస్తుతం అనేక చోట్ల డౌన్ అయింది. చాలా మంది యూజర్లు జీమెయిల్‌లోకి లాగిన్ అవలేకపోతున్నారు. లాగిన్ అయినప్పటికీ కొందరికి ఫైల్స్ అప్‌లోడ్‌, డౌన్‌లోడ్ కావడం లేదు. ఇంకొందరు మెయిల్స్ ను పంపలేకపోతున్నారు. మెయిల్స్ ను పంపాలని చూస్తే చెక్ యువర్ నెట్‌వర్క్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తోంది.

అయితే కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని యూజర్లు కూడా జీమెయిల్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్ డిటెక్టర్ అనే సంస్థ తెలిపింది. జీమెయిల్‌తోపాటు గూగుల్ డ్రైవ్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది.