క‌రోనా బాధితుల‌కు శృంగార స‌మ‌స్య‌ల్ని న‌యం చేసే డ్ర‌గ్..అనుమ‌తిచ్చిన ఎఫ్ డీఏ

క‌రోనా వైర‌స్ విరుగుడును క‌నిపెట్టేందుకు ప్ర‌పంచ దేశాల‌కు చెందిన సైంటిస్ట్ లు నిర్విరామంగా ప‌నిచేస్తున్నారు. మ‌రోవైపు వైర‌స్ దాడి చేస్తే శ‌రీరంలో ఏఏ భాగాలు దెబ్బ‌తింటాయో గుర్తించి..వాటిని న‌యం చేసేలా మెడిసిన్ ను త‌యారు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో యూఎస్ ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్ సోకిన బాధితులు శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు, లంగ్స్ పై వైర‌స్ ప్ర‌భావాన్ని తగ్గించేందుకు ఓ మెడిస‌న్ ను వినియోగిస్తున్నార‌ని, ఆ మెడిసిన్ సత్ఫ‌లితాలనిస్తున్న‌ట్లు స‌మాచారం.

మ‌నీ కంట్రోల్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం యూఎస్ కు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ 1970లో త‌యారు చేసిన ఆర్ఎల్ఎఫ్ -100 లేదా అవిప్టాడిల్ అనే డ్ర‌గ్ వ్యాధిగ్ర‌స్తుల్లో శ్వాసకోశ , ఊపిరితిత్తుల పై వైర‌స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తున్న‌ట్లు తేలింది.

మనీకంట్రోల్ ఇచ్చిన నివేదిక ప్రకారం అత్యవసర ప‌రిస్థితుల్లో అవిప్టాడిల్ ను వినియోగించేందుకు యుఎస్ ఎఫ్‌డిఎ ఇప్పటికే ఆమోదించింది.

అవిప్టాడిల్ అంటే ఏమిటి..? వ్యాధిగ్రస్తుల్లో శ్వాసకోశ స‌మ‌స్య‌లు, ఊప‌రితిత్తుల‌పై వైర‌స్ ప్ర‌భావాన్ని త‌గ్గించే మందు..?

అవిప్టాడిల్ అనేది సింథటిక్ హ్యూమన్ వాసోయాక్టివ్ ఇంటెస్టినల్ పాలీపెప్టైడ్ (వీఐపీ ) చెందిన ఈ డ్ర‌గ్ శరీరంలో రోగనిరోధక కణాలు మరియు నరాల‌తో పాటు శ‌రీరం అంతా వ్యాపిస్తుంది. ఊపిరితిత్తులలో కేంద్రీకృతమై న్యూరోట్రాన్స్మిటర్‌గా పనిచేస్తుంది. కండరాల కార్యకలాపాలు పనితీరు మెరుగుపర్చేలా వీఐపీ ప‌నిచేస్తుంది. ఈ డ్ర‌గ్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ సైటోకిన్ క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల్లోని లంగ్స్ పై ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది. అల్వియోలార్ టైప్ -2 కణాలు ఊప‌రితిత్తుల్లో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసేందుకు ఊప‌యోగ‌ప‌డుతుంది.

హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ 1970 లో విడుద‌లైన అవిప్టాడిల్ మందును క‌రోనా వైర‌స్ రోగుల‌కు అందించిన‌ట్లు..ఈ ట్రీట్మెంట్ అనంత‌రం వైర‌స్ నుంచి కోలుకున్న‌ట్లు తేలింది. మందులు ఇచ్చిన తీవ్రమైన అనారోగ్య కోవిడ్-19 రోగిలో కోలుకున్నట్లు నివేదించింది.

కాగా జెనీవాకు చెందిన రిలీఫ్ థెరఫ్యూటిక్స్ హోల్డింగ్స్ అనే ఫార్మా సంస్థ ఆర్ఎల్ఎఫ్ -100 పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఈ డ్ర‌గ్ అంగ‌స్తంభ‌న స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌నం ఇవ్వ‌డంలో ప్ర‌సిద్ధి చెందిన‌ట్లు తెలుస్తోంది.