ఫేషియ‌ల్ యోగాతో అందంగా… స్రవంతి

ఆడవారు అందంగా కనిపించాలని ఎన్నో ట్రిక్స్ చేస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా కరోన ప్రభావం వల్ల ఇంట్లో నుండి ఎవరు బయటకి వెళ్లడం లేదు. ఇంట్లో ఉండి అందంగా తయారు కావాలంటే ఎలానో చెబుతోంది మన డాక్టర్ స్రవంతి. ఆమె చెప్పే చిట్కాలు పాటించి అందంగా రెడీ అవ్వండి మరి. ఇంకా ఎందుకు ఆలస్యం ఆ చిట్కాలు చదవేయండి మరి…

క‌రోనా నేప‌థ్యంలో సెలూన్లు, బ్యూటీపార్లర్‌ల‌కు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది. వెళ్ల‌కుంటే.. ఎవ‌రి ముఖాలు వారే చూసుకోలేమంటున్నారు. శ‌రీరానికి చేసే యోగా‌తో పాటు ఫేషియ‌ల్ వ్యాయామం కూడా చేస్తే అందంగా ఉంటారంటున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ డాక్టర్ స్రవంతి ప్ర‌తిరోజూ యోగా చేయ‌మ‌ని చెబుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం మీద చార‌లు, ముడ‌త‌లు, డార్క్ స‌ర్కిల్స్‌, అకాల వృద్దాప్యం వంటి స‌మ‌స్య‌ల‌కు ఈ వ్యాయామం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాదు ఫేస్ కూడా మంచి గ్లో వ‌స్తుంది. అయితే ఈ ఫేషియ‌ల్ వ్యాయామం ఎలా చేయాలో వివ‌రంగా చెప్పారు. 

* కొద్దిగా తల పైకెత్తి చూస్తూ మీ అరచేతులను ఉపయోగించి, మీ మెడపై మసాజ్ ఇవ్వండి. ఇది మీకు టోన్డ్ నెక్‌లైన్ ఇస్తుంది.

* మీ బుగ్గలపై సహజమైన బ్లష్ పొందడం కోసం, మీ నోటిని గరిష్టంగా గాలితో నింపి కుడివైపు, ఎడమవైపుకి బుగ్గలను తిప్పండి.

* మీ చెంప ఎముకల చుట్టూ వేలి చివర్లతో మసాజ్ చేయాలి.

* మీ నుదుటిపై మీ వేళ్లను ఉంచి, సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ, నుదిటిపై ఎడమ నుండి కుడికి స్లైడ్ చేయండి. ఇది చారలను వదిలించడానికి సాయపడుతుంది.

* వీలైనంతగా మీ నాలుకను బయట ఉంచి, కాసేపు అలాగే ఉంచి మళ్లీ మామూలు స్థితికి రండి.