11 వేల మార్కు దాటిన నిఫ్టీ, 200 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

నేటి సెషన్ లో, ఆర్థిక మరియు లోహ స్టాక్‌ల నేతృత్వంలో భారత సూచికలు అధికంగా ముగిశాయి.

నిఫ్టీ 0.46% లేదా 52.35 పాయింట్లు పెరిగి 11,322.50 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.59% లేదా 224.93 పాయింట్లు పెరిగి 38,407.01 వద్ద ముగిసింది.

సుమారు 1559 షేర్లు పెరిగాయి, 1146 షేర్లు క్షీణించగా, 143 షేర్లు మారలేదు.

జీ ఎంటర్టైన్మెంట్ (5.16%), యాక్సిస్ బ్యాంక్ (3.92%), జెఎస్‌డబ్ల్యు స్టీల్ (3.94%), బిపిసిఎల్ (3.58%), మరియు ఇండస్ఇండ్ బ్యాంక్ (2.50%) నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో ఉండగా, శ్రీ సిమెంట్స్ (3.87%), టైటాన్ కంపెనీ (3.57%), యుపిఎల్ (2.33%), డాక్టర్ రెడ్డి (1.96%), మరియు సిప్లా (2.09%) నిఫ్టీ నష్టపోయిన వారిలో ఉన్నారు.

ఐటి, ఫార్మా మినహా అన్ని రంగాల సూచికలు సానుకూలంగా ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.20%, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 0.23% తగ్గాయి.

కెఇసి ఇంటర్నేషనల్

ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో సంస్థ యొక్క వార్షిక ఆదాయం 8.4% తగ్గింది. పతనం ఉన్నప్పటికీ, కంపెనీ స్టాక్స్ 7.34% పెరిగి రూ. 293.95 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా లిమిటెడ్

కంపెనీ, తన జూన్ త్రైమాస ఆదాయాన్ని నివేదించిన తరువాత బ్యాంక్ ఆఫ్ బరోడా లిమిటెడ్ షేర్లు 2.78% తగ్గి రూ. 47.20 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసంకంలో బ్యాంక్ రూ. 864.3 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

మదర్సన్ సుమి సిస్టమ్స్ లిమిటెడ్

ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ ఆదాయం 49.4% క్షీణించగా, ఈ కాలంలో కంపెనీ నికర నష్టం రూ. 810.5 కోట్లుగా ఉంది. అయినప్పటికీ, కంపెనీ స్టాక్స్ 2.38% పెరిగి రూ. 107.40 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

బాష్ లిమిటెడ్

ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో, బాష్ లిమిటెడ్ షేర్లు 2.48% క్షీణించి రూ. 13,255.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ సంస్థ ఆదాయం కూడా 64% తగ్గింది.

ఇండోకో రెమిడీస్ లిమిటెడ్

ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ ఆదాయం 9.2% పెరిగింది, కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.17 కోట్లు చేరుకుంది. కంపెనీ స్టాక్స్ 4.72% పెరిగి రూ. 261.55 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

జె‌ఎస్‌డబ్ల్యు స్టీల్

సంస్థ యొక్క ముడి ఉక్కు ఉత్పత్తి సంవత్సరానికి 5% తగ్గింది. అయితే కంపెనీ స్టాక్స్ 3.94% పెరిగి రూ. 254.85 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

శ్రీ సిమెంట్

ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ నికర లాభం 13.5% తగ్గింది. కంపెనీ స్టాక్స్ 3.87% క్షీణించి రూ. 21,530.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

టైటాన్ కంపెనీ

ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ స్వతంత్ర నికర నష్టం రూ. 270 కోట్లు కాగా, ఈ కాలంలో ఆదాయం 62.3% తగ్గింది. కంపెనీ స్టాక్స్ 3.57% తగ్గి రూ. 1,068.00 వద్ద ట్రేడ్ అయ్యాయి.

భారతీయ రూపాయి

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కొనుగోలు మధ్య అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రూ. 74.77 ల వద్ద ముగిసింది.

అధికంగా వాణిజ్యం జరిపిన ప్రపంచ మార్కెట్లు

ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ మరియు సాంకేతిక వాటాల డిమాండ్ పెరుగుదల ఆసియా మార్కెట్ల యొక్క సానుకూల చలనానికి దారితీసింది. నేటి ట్రేడింగ్ సెషన్లో యూరోపియన్ మార్కెట్లు కూడా అధికంగా ముగిశాయి. ఎఫ్‌టిఎస్‌ఇ 100 2.39 శాతం, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 2.88 శాతం పెరిగాయి. నిక్కి 225 1.88%, హాంగ్ సెంగ్ 2.11%, నాస్డాక్ 0.39% తగ్గాయి.