సానుకూలంగా ముగిసిన బెంచిమార్కు సూచీలు; 11,000 మార్కు పైన మెరిసిన నిఫ్టీ, 141 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్
వరుసగా మూడవ రోజు కొన్ని ఇంట్రాడే లాభాలను తుడిచిపెట్టిన తరువాత భారత సూచీలు అధికంగా ముగిశాయి. ఫార్మా రంగం ప్రధానంగా లాభాలను నడిపించింది.
నిఫ్టీ 0.50% లేదా 56.10 పాయింట్లు పెరిగి 11,270.15 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.37% లేదా 141.51 పాయింట్లు పెరిగి 38,182.08 వద్ద ముగిసాయి.
సుమారు 1723 షేర్లు పెరిగాయి, 166 షేర్లు మారలేదు, నేటి ట్రేడింగ్ సెషన్‌లో 996 షేర్లు క్షీణించాయి.
టాప్ నిఫ్టీ లాభాలలో సిప్లా (9.48%), ఎల్ అండ్ టి (4.84%), ఎం అండ్ ఎం (4.90%), టాటా మోటార్స్ (3.57%), సన్ ఫార్మా (3.45%) అగ్రస్థానంలో ఉండగా ఐషర్ మోటార్స్ (2.19%), ఏషియన్ పెయింట్స్ (1.23%) ), మారుతి సుజుకి (1.20%), బిపిసిఐ (1.17%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.16%) నిఫ్టీ నష్టపోయిన వారిలో ఉన్నాయి.
ఫార్మా, ఐటి, ఎఫ్‌ఎంసిజి, బ్యాంక్, ఆటోతో సహా అన్ని రంగాల సూచికలు ఆకుపచ్చగా ముగిశాయి. బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 1.47 శాతం, బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 1.42 శాతం పెరిగాయి.
మిశ్రమ గ్లోబల్ మార్కెట్ సూచనలు
యూరోపియన్ మార్కెట్లో కొనుగోలు కనిపించింది, ఇది సెషన్లో సానుకూలంగా వర్తకం చేసింది. ఎఫ్.టి.ఎస్.ఇ 100 0.53%, ఎఫ్.టి.ఎస్.ఇ ఎంఐబి 0.56% పెరిగాయి. అయినాకూడా, నాస్డాక్ 0.87%, నిక్కీ 225 0.39%, హాంగ్ సెంగ్ 0.63% తగ్గడంతో, నేటి ట్రేడింగ్ సెషన్లో ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా వర్తకం చేశాయి,
పిసిఎ లాబొరేటరీస్
ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ ఏకీకృత నికర లాభంలో సంవత్సరానికి 245% వృద్ధిని నమోదు చేసింది, అయితే ఈ కాలంలో సంస్థ యొక్క ఆదాయం 42% పెరిగింది. కంపెనీ స్టాక్స్ 7.25% పెరిగి రూ. 2,098.55ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో, కంపెనీ ఏకీకృత నికర లాభంలో 65% క్షీణించినప్పటికీ, కంపెనీ షేర్లు 3.60 శాతం పెరిగి రూ. 343.80 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ కాలంలో కంపెనీ ఆదాయం 55% తగ్గింది.
మహీంద్రా అండ్ మహీంద్రా
ట్రాక్టర్ వ్యాపారంలో శక్తివంతమైన పనితీరు కారణంగా ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంపాదన పెరిగింది. నేటి ట్రేడింగ్ సెషన్లో కంపెనీ స్టాక్స్ 4.90% పెరిగి రూ. 629.90 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్
ఈ కంపెనీ అధిక అమ్మకాలు మరియు కనిష్ట కోవిడ్D-19 ప్రభావాన్ని నివేదించిన తరువాత, దివి లాబొరేటరీస్ స్టాక్స్ 12.06% పెరిగి రూ. 3,120.75 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో సంస్థ యొక్క ఏకీకృత నికర లాభం 81% పెరిగింది.
సిప్లా లిమిటెడ్
ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ బలమైన ఆదాయాలను నివేదించింది, ఇది స్ట్రీట్ యొక్క అంచనాలను అధిగమించింది. జూన్ 2020 తో ముగిసిన త్రైమాసంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 26.6% పెరిగింది. కంపెనీ స్టాక్స్ 9.48% పెరిగి రూ. 797,70 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
ఇమామి లిమిటెడ్
ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో, కంపెనీ నికర లాభం 1.17 శాతం పెరిగింది, అయితే ఈ కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 25.79% తగ్గింది. కంపెనీ స్టాక్స్ 20% పెరిగి రూ. 308.75 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్
తేజస్ నెట్‌వర్క్స్, ఎల్ అండ్ టి కన్స్ట్రక్షన్ నుండి రూ. 66 కోట్ల కొనుగోలు ఆర్డర్ ను పొందింది. గత త్రైమాసంలో కంపెనీ అందుకున్న ఈ సరఫరా ఆర్డర్, ఈ త్రైమంలో ప్రారంభమైంది. కంపెనీ స్టాక్స్ 4.93% పెరిగి రూ. 63.85 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
భారతీయ రూపాయి
నేటి సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కొనుగోలు మధ్య యుఎస్ డాలర్‌తో భారత రూపాయి అధికంగా రూ. 74.89 ల వద్ద ముగిసింది