పాకిస్తాన్ మ్యాప్‌లో ఏముందో తెలుసా

పాకిస్తాన్ త‌న వ‌క్ర‌బుద్ధిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. జ‌మ్మూకాశ్మీర్ , ల‌డాఖ్, జూనాగ‌ఢ్ త‌మ‌దేనంటూ పాకిస్తాన్ ఒక కొత్త మ్యాప్ ను త‌యారు చేసింది. ఆ మ్యాప్ కు పాక్ మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. భార‌త కేంద్ర ప్ర‌భుత్వం సంవ‌త్స‌రం క్రితం అంటే 2019 ఆగ‌స్ట్ 5 న ఆర్టిక‌ల్ 370 ను ర‌ద్దు చేస్తూ జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్ర‌త్యేక అధికారాలిచ్చి నేటికి సంవ‌త్స‌రం అయ్యింది. ఈ సంద‌ర్భంగా పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ కొత్త మ్యాప్ ను విడుద‌ల చేశారు. ఆ మ్యాప్ లో గుజరాత్‌లోని భూభాగాలైన జునాగ‌ద్, మాన్వ‌దార్, స‌ర్ క్రీక్ ప్రాంతాల‌తో పాటు జమ్మూకశ్మీర్, లడాఖ్ లోని ప్రాంతాలను తమవేనంటూ మ్యాప్ లో క‌లుపుకుంది. మ్యాప్ విడుద‌ల‌పై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ రోజు, మేము పాకిస్తాన్ యొక్క కొత్త పటాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము. ఈ కొత్త పటాన్ని పాకిస్తాన్ మంత్రివర్గం, ప్రతిపక్షం మరియు కాశ్మీరీ నాయకత్వం ఆమోదించింది. ఈ పటం మొత్తం దేశం మరియు కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల అనుగుణంగా ఉంది అంటూ ఇమ్రాన్ ఖాన్ వెల్ల‌డించారు.