కరోనాతో ఖాజాపూర్ మాజీ సర్పంచ్ మృతి
కరోనాతో పోరాడుతున్న మృతిచెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇవాళ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ మాజీ సర్పంచ్ తీగుళ్ల విజయలక్ష్మీ మృతి చెందారు. దీంతో ఆ గ్రామం త్రీవ విషాదంలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె మడూరు సహకార సంఘం చైర్మన్ కొనసాగుతున్నారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆమె రైతులకు కోసం తెరాస తీసుకువస్తున్న పథకాలను ప్రతి రైతుకు అందేలా చేస్తానని చెప్పిన ఆమె కరోనా మహమ్మారితో మృతి చెందడంతో ఆయా గ్రామాల రైతులు విషాదంలో ఉన్నారు. కరోనాతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.