తల్లిపాలే మొదటి ఔషదం : డాక్టర్ శ్వేత
ప్రపంచ తల్లిపాల వారోత్సవం ప్రతి సంవత్సరం అగష్టు 1 నుండి 7 వ తేదీ వరకు నిర్వహిస్తారు. దాని ముఖ్య ఉద్దేశ్యము తల్లిపాల ప్రాధాన్యత, పుట్టిన శిశువుకు తల్లిపాలు చేసే ప్రయోజనం గురించి తెలియజేయడమని కిమ్స్ సవీర వైద్యురాలు శ్వేత అన్నారు. పుట్టినప్పుడే గంటలోపు తీసుకునే పాలే బిడ్డకు మొదటి ఔషదమని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమైనవి. వ్యాధినిరోదక శక్తిని కలిగిస్తాయి. తల్లిబిడ్డల అనుబంధాన్ని పెంచుతాయి. మిగిలిన పాల ఉత్పత్తులు ఎన్నివున్నా.. తల్లిపాల ప్రాముఖ్యత ముందు వాటిగ ప్రయోజనము తక్కువే అని చెప్పకోవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తల్లిపాలు శిశువు పుట్టిన గంటలోపు నుండి మొదలుపెట్టాలి. అలా 6 నెలల పాటు శిశువుకు తల్లిపాలు ఆహారంగా ఇస్తే శిశువకుకి ప్రయోజనం చేకురుతుంది. 6 నెలల తర్వాత పాలతో పాటు పోషాకాహారాన్ని కూడా పాలతో పాటు తినిపించడం మంచిది. పుట్టిన తర్వాత మొదటి గంటలో పాలివ్వడాన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఆ పాలు లేదా కొలెస్ట్రమ్ శిశువుకు శక్తితో పాటు, పెరుగుదలకు, అభివృద్ధికి సహాయపడుతుంది. బిడ్డకు గంటలోపల ఇచ్చేపాలు మొదటి టీకా అవుతుంది.
తల్లిపాల వల్ల ప్రయోజనాలు
అనేక గంటల పాటు ప్రసవ వేదన తర్వాత స్త్రీ బిడ్డకు జన్మను ఇచ్చి తల్లి అవుతుంది. తల్లీ బిడ్డల మధ్య అనుబంధాన్ని ఆస్వాదించడానికి నర్సు బిడ్డను తల్లి ఛాతీపైన ఉంచుతుంది. అందువల్ల ఆమె ఒడిలో శిశువు ఏడవడం ఆపి తల్లిని గుర్తిస్తుంది. పాలను తీసుకోవడం మొదలుపెడుతుంది. తల్లిపాలు శుభ్రమైనవి, ఆరోగ్యకరమైనవి అంతేకాకుండా ఖర్చులేనివి. బిడ్డకు తేలికగా జీర్ణమయ్యేందుకు సహాకరిస్తాయి.
అందుకే తల్లిపాలు త్రాగి పెరిగిన పిల్లలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి, మేధోశక్తి ఎక్కువగా ఉంటుంది. విరేచనాలు, కడుపు ఉబ్బరం, జలుబు, జ్వరం, గొంతు, చెవికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వీరి దరిచేరవు. మొదల 6నెలలు శిశువు కేవలం తల్లిపాలు మీద మాత్రమే ఆధారపడి ఉంటారు. తల్లికి తన పాలు బిడ్డకు ఇవ్వడం వల్ల మానసికంగా… శారీరకంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ అనే హార్మోన్ల విడుదల వల్ల ఒత్తిడి తగ్గి మంచి ఆలోచనలు కలిగించి తల్లిబిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.
తల్లిపాలు శిశువుకు ఇవ్వడం వల్ల తల్లి శరీర బరువు అదుపులో ఉండి ప్రసవ అంతరానికి తోడ్పడుతుంది. తల్లికి రొమ్ము, అండశాయం క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అధిక బరువు రుమటాయిడ్, ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి తల్లులలో రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
తల్లిపాలు ఇవ్వడానికి ఏ, బి, సి విధానం
ఏ- అవగాహాన, బిడ్డకు ఆకలైన విషయాన్ని అర్ధం చేసుకోవడం, ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటారు. శిశువు నోటి దగ్గర వేళ్లు తెచ్చి ఆకలివేస్తున్న సంకేతాలు ఇవ్వడం ద్వారా తెలియజేస్తుంది. తల్లి చనుబాల దగ్గరకు నోటిని చేర్చడం కూడా చేస్తారు.
బి-ఓపిక కలిగి ఉండడం, శిశువుకు ఆకలి తీరేంతవరకు తాగనివ్వాలి, తొందర చేయవద్దు. సాధారణంగా శిశువు ఒక్కొక్క రొమ్ము దగ్గర 10 నుండి 20 నిమిషాలు తల్లిపాలు తాగుతారు.
సి-కంఫర్ట్, సౌకర్యవంతంగా ఉండడం. తల్లి పాలిచ్చేటప్పుడు సౌకర్యంగా, విశ్రాంతిగా ఉండేలాగా అవసరమైన మెత్తని దిండ్లను చేతులు, కాళ్లు, తల, మెడ దగ్గర అనువుగా ఉంచుకోవాలి.
తల్లి ఆరోగ్యం
తల్లి తనకు, బిడ్డకు అవసరమైన పోషాకాహారన్ని అందించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. గర్భధారణకు ముందునుండే శరీరమునకు కావాల్సిన అన్నిరకాల పోషాకాలు వి,డి,డి1, బి12, ఐరన్ ఇలాంటివన్నిఅందేలాగా సిద్దం కావాలి. తను ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఎటువంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా జన్మిస్తారు.
అందువల్ల విటమిన్ డి లేని తల్లిపాలు ఇచ్చే బిడ్డకు తగినంత సూర్యరశ్మిని అవసరం. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపి) ప్రకారం తల్లిపాలు తాగే శిశులందరూ రోజు 400 అంతర్జాతీయ యూనిట్ల విటమిన్ డి మొక్క సప్లిమెంట్ తీసుకోవాలి.
రక్తహీనత కలిగిన తల్లులు తమ గర్భంలో బలహీనమైన పిండం పెరుగుదలను కలిగి ఉంటారు. బాల్యంలో నాడీ అభివృద్ధికి ఐరన్ తగినంతగా తీసుకోవడం అవసరం. అటువంటి పిల్లలను గమనించి ప్రతినెల నాలుగు కిలోల బరువుకు 1 మిల్లీగ్రాము ఐరన్ ఇవ్వాలి.
విటమిన్ బి12 కొరత ఉన్న మహిళలు పుట్టిన అటువంటి వారు వైద్యుని సంప్రదించి ఆకు కూరలు, కూరగాయలు, పండు, ప్రోటీన్లు తగినంత నీరు తీసుకుంటూ తమను తాము హైడ్రేట్‌డ్ గా ఉంచుకోవాలి.
కోవిడ్-19 సమయంలో తల్లిపాలివ్వడం
అనుమానిత లేదా దృవీకరించిబడిన కోవిడ్ లక్షణాలు ఉన్న తల్లులను ప్రోత్సహించాలని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ సిఫార్స్ చేస్తోంది.
- శిశువును తాకేముందు చేతులను కడుక్కోవాలి
- బాలింత తన బిడ్డను హత్తుకోవడానికి బిడ్డతో పాటు ఒకే గదిలో ఉండి పాలు పట్టించడానికి తగిన సహాయం అందించాలి.
- తల్లి పాలిచ్చేటప్పుడు ముఖాన్నిపూర్తిగా వస్త్రంతో కప్పుకోవాలి.
- సీసా భాగాలు లేదా రొమ్ము భాగాన్ని తాకేముందు చేతులు శుభ్రంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఉపయోగించిన తర్వాత అన్ని భాగాలు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. శిశువుపై దగ్గడం, తుమ్మడం వంటివి చేయరాదు.
- తల్లిపాలు అమృతం, అది ప్రకృతి ఆరోగ్య ప్రణాళిక, తల్లిపాలు ఇవ్వడం, ప్రతి శిశువుకు ఉత్తమ ఎంపిక.