బాక్స్ 360 నుండి ఎన్నోలాభాలు మీకు తెలుసా
కరోనా మహమ్మారి రోజురోజుకూ ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. మనం పుట్టినరోజు పార్టీకి వెళ్లినా, కూరలు కొనుగోలు చేసినా, నగలు, బహుమతులు తీసుకున్నా, లేదా మన గాడ్జెట్లను ఇతరులతో పంచుకున్నా కూడా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఈ వైరస్ ప్రధానంగా మూడు రకాలుగా వ్యాపిస్తోంది. అవి.. నేరుగా, ఉపరితలాల ద్వారా, గాలి ద్వారా. వివిధ ఉపరితలాలను శుభ్రం చేయడానికి హైదరాబాద్‌కు చెందిన సేఫ్‌వే అడ్వాన్స్డ్ డిజిన్ఫెక్టెంట్ సిస్టమ్స్ సంస్థ వినూత్నమైన, విభిన్నమైన అల్ట్రా వయొలెట్ పరిష్కారాన్ని ఆవిష్కరించింది. ఇది వివిధ ఉపరితలాల మీద ఉండే వైరస్‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది. వారు రూపొందించిన “బాక్స్ 360” అనే పరికరం ఎలాంటి రసాయనాలు లేకుండా అన్ని రకాల వస్తువులను అత్యంత సురక్షితంగా, సమర్ధంగా శుభ్రం చేస్తుంది. ఇది ఒక లోహపు పెట్టెలా ఉంటుంది. అందులో ఒక అల్ట్రా వయొలెట్ బల్బు ఉంటుంది. దానిలోపల ఏం పెట్టినా వాటిని కంటికి కనిపించని అల్ట్రా వయొలెట్ కిరణాలతో పూర్తిగా శుభ్రం చేసి, మనకు అత్యంత పరిశుభ్రమైన వస్తువులను తిరిగి ఇస్తుంది. ఆహార పదార్థాల ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, నగల బాక్సులు, సెల్‌ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు, కారు తాళాలు.. ఇలా వేటినైనా కరోనా ఉన్న వ్యక్తి తమ చేత్తో తాకినప్పుడు వాటి ఉపరితలాల మీద వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. వాటిని ఆరోగ్యవంతమైన మరో వ్యక్తి తాకితే, ఆ వైరస్ వారికి వ్యాపించే ప్రమాదం ఉంది. కానీ ఈ పరికరాలు, వస్తువులు అన్నింటినీ పూర్తిగా శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. రోజువారీ జీవితాలను సులభతరం చేసి, వ్యాపారాలను కూడా సాధారణ స్థాయికి తేవడానికి సేఫ్‌వే అడ్వాన్స్డ్ డిజిన్ఫెక్టెంట్ సిస్టమ్స్ సంస్థ అపారమైన పరిశోధనలు చేసి, బాక్స్ 360ని రూపొందించింది.
బాక్స్ 360 ప్రధాన లక్షణాలు
మందులు తప్ప మరే వస్తువునైనా 3 నుంచి 10 నిమిషాల్లో ఇది శుభ్రం చేస్తుంది. ఆసుపత్రులలో ఉపయోగించే స్టీలును ఇందులో వాడారు. ఇది పూర్తిగా లీక్ ప్రూఫ్, సురక్షితం, దీని ధర కూడా తక్కువ కావడంతో సాధారణ వ్యక్తుల నుంచి చిన్న వ్యాపారాలు, పెద్దపెద్ద మాల్స్, ఆసుపత్రులు.. ఇలా అన్నిచోట్లా ఉపయోగించవచ్చు. ధర రూ. 14 వేల నుంచి లక్ష లోపే ఉంటుంది, ఐఫోన్ కంటే తక్కువకే లభిస్తుంది. దాదాపు 125 రంగాలకు ఇది చాలా అవసరం. దీనికి ప్రతిష్ఠాత్మకమైన సీసీఎంబీలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో సహా నాలుగు సర్టిఫికేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరంతో సహా దేశవ్యాప్తంగా అధీకృత డీలర్ల ద్వారాను, తమ సంస్థ వెబ్‌సైట్ ద్వారా, అమెజాన్‌లోనూ బాక్స్ 360 అందుబాటులో ఉంది. “కరోనా రోగులు మాస్కు లేకుండా దగ్గినప్పుడు, తుంపర్లు బయటకు వస్తాయి. వాటిలో కరోనా వైరస్ ఉంటుంది. ఆ వైరస్ గాలిలో 3 గంటల పాటు ఉండిపోతుంది. అందువల్ల ఆ వ్యక్తి అక్కడ లేకపోయినా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం వాడే ప్రతి వస్తువును, పంచుకునే వాటినీ పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. సెల్‌ఫోన్లు, పర్సులు, కారు తాళాలు.. ఇలా అన్నింటినీ బాక్స్ 360 శుభ్రం చేస్తుంది. దాన్ని మేం పీసీఆర్‌లో 30 సెకండ్లు, 1 నిమిషం.. ఇలా 12 నిమిషాల వరకు శుభ్రం చేసి పరీక్షించాం. అందులో 2 నిమిషాల వద్ద వైరస్ పూర్తిగా అంతమవుతోందని తెలిసింది. అయినా మేం జాగ్రత్త కోసం 3 నిమిషాలకు డబుల్ బీప్ పెట్టాం. అల్ట్రా వయొలెట్ స్టెరిలైజేషన్‌ను చాలాకాలం నుంచి వాడుతున్నాం. మనం తాగే నీళ్లను కూడా దీంతో శుభ్రం చేస్తాం. తమ మాస్కులను యూవీ పద్ధతిలో శుభ్రం చేయడం మంచిదని 3ఎం సంస్థ చెప్పింది. ఈ యూవీ కిరణాలు కంటికి కనపించవు. మేం ఇందులో వాడిన నీలిరంగు బల్బు కేవలం లోపల రేడియేషన్ ఉందని చూపించడానికి మాత్రమే,” అని సేఫ్‌వే మెడికల్, ఆర్అండ్‌డీ డైరెక్టర్ డాక్టర్ ప్రణీత్ అన్నారు. “మేం ఈ రోజు 5 రకాల ఉత్పత్తులను విడుదల చేస్తున్నాం. రాబోయే ఏడాది కాలంలో 37 ఉత్పత్తులు తేవాలన్నది మా లక్ష్యం. యూవీ బాక్స్ 360తో పాటు, యూవీ రూం డిజిన్ఫెక్టెంట్ సిస్టం “షీల్డ్ 360″ని మేము లాంచ్ చేశాము. ఇది గృహ వినియోగానికే కాకుండా వాణిజ్య అవసరాలకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ప్రజా రవాణాల్లో ఇది చాలా అవసరం. ఈ ఏడాదిలోగా 10,000 బాక్స్360లు అమ్మాలనుకుంటున్నాం. చిన్న వ్యాపారాలు కోలుకోవాలంటే ఇలాంటివి చాలా అవసరం. దీన్ని పూర్తిగా మేమే తయారుచేసి, ఎలాంటి లీకేజిలు లేకుండా ఉండేలా పటిష్ఠంగా పరీక్షించాం. ఇందులో వైద్యశ్రేణి స్టీలు ఉపయోగించాం. వాటిని ఆసుపత్రులలో పరికరాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు,” అని సేఫ్‌వే వ్యవస్థాపకుడు, సీఎండీ సీవీఎన్ వంశీ అన్నారు.
ఇదెలా పనిచేస్తుందంటే..
మనం శుభ్రం చేయాలనుకున్నవాటిని బాక్స్360లోని ట్రేలో పెట్టి, మూత సరిగ్గా వేయాలి. మూత పూర్తిగా పడిందని తెలిసేందుకు ఒక సింగిల్ బీప్ వస్తుంది. అప్పుడు అల్ట్రావయొలెట్ లీకేజి ఏమీ ఉండదు. తర్వాత మనం స్విచ్ వేసి, ఎర్ర బటన్ నొక్కితే, లోపల పని చేయడం మొదలవుతుంది. 3 నిమిషాల తర్వాత రెండుసార్లు బీప్ శబ్దం వస్తుంది. అప్పుడు కరెంటు ఆపేసి, మన చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుని, తలుపు తెరిచి లోపలున్నవాటిని తీసుకోవచ్చు. ఇక వాటిమీద ఎలాంటి వైరస్ ఉండనే ఉండదు. పూర్తి సురక్షితం.
మూడు రకాల మోడళ్లలో..
వివిధ రకాల వాడకాల కోసం బాక్స్ 360 మూడు రకాల మోడళ్లలో లభ్యమవుతుంది. మొదటిది ఆటమ్ (55 లీటర్లు). దీన్ని ఇళ్లలో వాడుకోవచ్చు. సెల్‌ఫోన్లు, ఆహార పదార్థాల ప్యాకెట్లు, కళ్లద్దాలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలను దీంతో శుభ్రంచేయొచ్చు. రెండోది జీటీఎం-1 (253 లీటర్లు). సెలూన్లు, దంతవైద్యశాలలు, చిన్న, మధ్యస్థాయి ఆఫీసులు, విద్యాసంస్థల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. మూడో మోడల్ పేరు జీటీఎం-2 (650 లీటర్లు). దీన్ని ఆసుపత్రులు, ఐటీ పార్కులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మాల్స్ లాంటిచోట్ల వాడచ్చు.