రెడ్‌మి నోట్ 9 విడుదల చేసిన షావోమి ఇండియా
48 ఎంపి క్వాడ్ కెమెరా అర్రే, ఫుల్ హెచ్‌డి+ డాట్ డిస్‌ప్లే, పనితీరు ఆధారిత మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెసర్ మరియు మాసివ్ 5020 ఎంఎహెచ్ బ్యాటరీ
భారతదేశపు నంబర్ ఒన్ స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ షావోమి తన బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్ విడుదలను ప్రకటించింది. రెడ్‌మి నోట్ 9 అత్యుత్తమ పనితీరును కనబరిచే మీడియా టెక్ హీలియో జి85ను భారతదేశానికి మొదటిసారిగా పరిచయం చేస్తోంది.
షావోమి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుజ్ శర్మ దీని గురించి మాట్లాడుతూ ‘‘ప్రతి రెడ్‌మి నోట్‌తో మేము ప్రతి ఒక్కరికీ ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకు రావడంలో ఒక అడుగు ముందుకు వేయిస్తున్నాము. రెడ్‌మి నోట్ 8 ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కాగా, రెడ్‌మి నోట్ సిరీస్ మొత్తంలో మే 2020లో కెనాలిస్ ఎస్టిమేట్ స్మార్ట్‌ఫోన్ అధ్యయనం మేరకు 18.5 కోట్ల+ షిప్‌మెంట్లను అధిగమించి పలు రికార్డులను అది అధిగమించింది. రెడ్‌మి నోట్ సిరీస్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయానికి రుజువుగా నిలిచిందని’’ వివరించారు.
‘‘రెడ్‌మి నోట్9 ఈ శ్రేణికి పనితీరు మరియు గేమింగ్ కేంద్రిత మీడియా టెక్ హీలియో జి85 అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా నూతన దృష్టికోణాన్ని తీసుకు వచ్చింది. 16.5 సెం.మీ. (6.53) డాట్ డిస్‌ప్లే ఫుల్ హెచ్.డి+ రిజల్యూషన్ ఈ శ్రేణిలో మమేకమయ్యే అనుభవాన్ని తీసుకు వస్తోంది. రెడ్‌మి నోట్ 9కు మా దృష్టి ఈ శ్రేణికి హెచ్‌డి ఆన్‌లైన్ గేమింగ్ అనుభవాన్ని తీసుకు వచ్చే లక్ష్యంపై ఉంచాము. ఎంఐ అభిమానులు మరియు వినియోగదారులు రెడ్‌మి నోట్ 9తో కలిసి వచ్చే హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌ను కచ్చితంగా ప్రశంసిస్తారు మరియు రెడ్‌మి హోం నుంచి అత్యుత్తమమైనదాన్ని తీసుకు వచ్చే భరోసాను కొనసాగిస్తామని’’ తెలిపారు.
పనితీరు
రెడ్‌మి నోట్ 8 సమతుల్యతతో, బహుముఖ పనితీరును అందుబాటులోకి తీసుకు రాగా రెడ్‌మి నోట్ 9 ఈ శ్రేణిలో ఉన్నత పనితీరును అందించే స్మార్ట్‌ఫోన్లకు వృద్ధి చెందుతున్న అవసరాలను పూర్తి చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. పనితీరు మరియు కేంద్రీకృత ఆక్టా-కోర్ మీడియా టెడ్ హీలియో జి85 రెండు కార్ట్‌క్స్ –ఎ75 కేంద్రంగా 2.0 గిగాహెడ్జ్ వరకు మరియు ఆరు కార్టెక్స్-ఎ55 కేంద్రం 1.8 గిగా హెడ్జ్ వరకు వేగాన్ని అందిస్తుంది. రెడ్‌మి నోట్ 8తో పోల్చితే రెడ్‌మి నోట్ 9 పనితీరులో 21% వృద్ధి ఉంది. గేమింగ్ పనితీరులో 25% ఎక్కువ అందించడం ద్వారా మాలి-జి52 1000 మెగా హెడ్జ్ వరకు విస్తరించడం ద్వారా రెడ్‌మి నోట్ 9లో శక్తియుత గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది దీన్ని ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేలో ఆస్వాదించవచ్చు. దీనిలోని 5020 ఎంఎహెచ్ బ్యాటరీ 2 రోజుల వరకు ఫోన్‌ను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. 22.5 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జర్ (బాక్సులో ఉంటుంది) రెడ్‌మి నోట్ 9ను అత్యంత తక్కువ సమయంలో ఛార్జ్ చేస్తుంది. టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ 9డబ్ల్యు రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఔరా బ్యాలెన్స్ డిజైన్
రెడ్‌మి నోట్ 9 ఔరా బ్యాలెన్స్ డిజైన్ కలిగి ఉండగా, దీన్ని మొట్టమొదటి సారిగా రెడ్ మి నోట్ 9 ప్రో సిరీస్‌లో పరిచయం చేశారు. 16.5 సెం.మీ. (6.53) డాట్ డిస్‌ప్లే గరిష్ఠ స్ర్కీన్ ప్రదేశాన్ని అందిస్తుండగా, ఫుల్ హెచ్‌డి+ (2340 X 1080) రిజల్యూషన్ మమేకం అయ్యే అనుభవాన్ని అందిస్తుంది. 3డి కర్వ్‌డ్ వెనుక చేతుల్లో చక్కని గ్రిప్ అనుభవాన్ని అందిస్తుంది మరియు 48 ఎంపి కెమెరా అర్రే దిగువనే ఉంటుంది. విశ్వసనీయ మనోరంజన మరియు యుటిలిటీ అందించేందుకు రెడ్‌మి నోట్ 9 ఫ్రేమ్ దిగువన 3.5 మి.మీ. హెడ్ ఫోన్ జాక్ మరియు ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్‌ను పై భాగంలో కలిగి ఉంది.
కెమెరా
రెడ్‌మి నోట్ 9 క్వాడ్ కెమెరా అర్రే కలిగి ఉండగా 48 ఎంపి శామ్‌సంగ్ ఐసోసెల్ బ్రైట్ జిఎం1, 8 ఎంపి అల్ట్రా వైడ్, 2 ఎంపి మ్యాక్రో మరియు 2 ఎంపి డెప్త్ సెన్సర్లను కలిగి ఉంది. ఫొటోగ్రఫీ మరియు వీడియోలో మరియు 21:9 మూవీ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. వృద్ధి పరచిన ప్రొడక్టివిటీ మరియు వినోదానికి ప్రో-కలర్, డాక్యుమెంట్ స్కానర్ మరియు కెలెడియోస్కోప్ కూడా రెడ్‌మి నోట్ 9లో ఉన్నాయి. 13ఎంపి ఏఐ సెల్ఫీ సెన్సర్ ఫ్రంట్ కెమెరాలో ఉన్నాయి.
నాణ్యత
అన్ని రెడ్‌మి ఉత్పత్తుల తరహాలోనే రెడ్‌మి నోట్ 9 అత్యున్నత స్థాయి నాణ్యతను కలిగి ఉంది. మా మేక్ ఇన్ ఇండియా పథకం కొనసాగింపు ప్రయత్నాలకు అనుగుణంగా మేము మా అన్ని రెడ్‌మి ఉత్పత్తుల నాణ్యత కొలమానాలకు ప్రత్యేకం దృష్టి సారించాము. రెడ్‌మి నోట్ 9 ముందు వైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, పి2ఐ వాటర్ రెసిస్టెంట్ కోటింగ్, 4µm పైరోలిటిక్ షీట్‌తో పాటు అకస్మాత్తుగా పడడం మరియు నీరు చిమ్మినప్పుడు రక్షణ అందించేందుకు బలవర్థిత అంచులను కలిగి ఉంది.
లభ్యత
రెడ్‌మి నోట్ 9 మూడు వర్ణాల మోడళ్లు, పెబల్ గ్రే, ఆర్టిక్ వైట్ మరియు ఆక్వా గ్రీన్‌లో 4జిబి64జిబి, 4జిబి+128 జిబి మరియు 6జిబి128 జిబి స్టోరేజ్ వేరియెంట్లలో వరుసగా రూ.11,999, రూ.13499 మరియు రూ.14,999లలో mi.com, అమెజాన్ ఇండియా, ఎంఐ హోమ్స్ మరియు ఎంఐ స్టూడియోలలో జులై 24,2020 నుంచి లభిస్తుంది