బాధ్యత అందరిపై ఉంది
కరోనా ఇప్పుడు గ్రామాలకు కూడా పాకింది. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్, జిల్లా, మండల కేంద్రాలకే పరిమితమైన కరోనా గ్రామాలకు కూడా విస్తరించడంతో ప్రజలు భయందోళనలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ప్రభుత్వం చెప్పిన నియమాలు పాటించాల్సిన అవరసరం ఉంది. ప్రభుత్వం చేపట్టిన కొన్ని సర్వేల ఆధారంగా గ్రామంలోని యువత అనవసరమైన ప్రచారాన్ని ఆయా గ్రామాల వాట్సప్ గ్రూపులలో చర్చిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతి గ్రామనికి సంబంధించిన వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టా గ్రాం ఖాతాలను, గ్రూపులను పరీశీలిస్తోంది. అయితే ఇటీవల కాలంలో మెదక్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో యువత కరోనాపై అనవసరమైన చర్చ నిర్వహిస్తున్నారని పేర్కొంది. వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటందని ఆయా వ్యక్తుల వివరాలు గ్రామ అధికారాలు త్వరలో పంపింనున్నారని సమాచారం. అయితే దీంతో యువత గతంలో తాము చేసిన చర్చల గురించి ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైన ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వ నియమాల ప్రకారం నడుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన వ్యక్తిని వారి కుటుబంబాన్ని కించపరిచినట్లు చూసినా… ఇబ్బందులకు గురి చేసినా.. చట్ట రీత్యా చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.