వారానికి రెండు రోజులు పూర్తి లౌక్‌డౌన్
కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు వేగంగా పెరగడంతోపాటు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ మొదలైనందున బెంగాల్ సర్కార్ లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేసింది. వారంలో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. గురు, శని వారాల్లో ఈ లాక్‌డౌన్‌ను అమలు చేస్తామని స్టేట్ హోం సెక్రటరీ అలపన్ బంధోపాధ్యాయ్ చెప్పారు. స్టేట్ సెక్రటేరియట్‌లో సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన హై లెవల్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డాక్టర్‌లు, నిపుణులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీస్, పోలీసులతో సమాలోచనలు జరిపాక ఈ డెసిజన్ తీసుకున్నామని పేర్కొన్నారు. జూలై 27 (సోమవారం) నుంచి లాక్‌డౌన్ అమలులోకి వస్తుందన్నారు. ఆ తర్వాత లాక్‌డౌన్ 29న ఉంటుందన్నారు.