ధరిపల్లి రైతులకు బాసటగా రాజశేఖర్‌రెడ్డి
ఓ రైతు కష్టం ఇంకో రైతుకు మాత్రమే తెలుసు. ఆ కష్టం సాటి రైతు పడకుండా ఉండేందుకు ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాడు మెదక్ జిల్లా ధరిపల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ రాజశేఖర్‌రెడ్డి. కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కిసాన్ కార్డులను నమోదు చేసుకోవాంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సామాన్య రైతుకి కత్తి మీద సాములాంటిందే. అసలే కరోనా కష్టంకాలం, పైగా చేతిలో చిల్లిగవ్వలేని సమయం… అంతా వానాకాలం పంటలకు పెట్టుబడి పెట్టారు. కానీ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కిసాన్ కార్డులలో నమోదు చేసుకుంటే అప్పుడప్పుడు కేంద్రం నుంచి వచ్చే సాయం, ప్రభుత్వ లోన్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ కార్డులను తెచ్చుకోవాలంటే మండల కేంద్రానికి వెళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితులు కనినిస్తున్నాయి. మండల కేంద్రంలోని కామన్ సర్వీస్ (సీఎస్‌సీ) సెంర్‌లో ఈ నమోదు కార్యక్రమం జరుగుతోంది. కరోన వ్యాప్తి చెందుతుందన్న భయంతో మండల కేంద్రానికి ఆటోల రాకపోకలు నిలిపివేశారు. అయితే ఇప్పుడు స్వంతగా ఆటో మట్లాడుకొని పోవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందనిఅయితే ఇటీవల గ్రామంలో ముచ్చటించుకుంటున్న రైతులను చూశాడు రాజశేఖర్‌రెడ్డి. వెంటనే సీఎస్‌సీ సెంటర్ నిర్వహాకులకు ఫోన్ చేసి తప్పకుండా కిసాన్ కార్డుల నమోదు కేంద్రాన్ని తమ గ్రామమైన ధరిపల్లిలో పెట్టాలని కోరారు. దీంతో సదరు నిర్వహాకులు తమ అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరలోనే సీఎస్‌సీ సెంటర్‌ని ధరిపల్లిలో పెట్టి కిసాన్ కార్డుల నమోదు కార్యక్రమాన్ని చేపడుతామని హామీ ఇచ్చారు. కాగా ధరిపల్లి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా గ్రామంలోనే నమోదు చేసుకోవచ్చు. దీని ద్వారా కరోనా వ్యాప్తి కూడా తగ్గించవచ్చు అని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల మండల కేంద్రానికి సమీప గ్రామామైన మీర్జాపల్లిలో కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని, ఈ కిసాన్ కార్డుల నమోదుకు అనేక గ్రామాల నుండి మండల కేంద్రానికి వస్తే.. కరోనా సోకే అవకాశం ఉండడంతో తప్పకుండా సీఎస్‌సీ కేంద్రాన్ని ధరిపల్లిలో పెట్టాలని రాజశేఖర్‌రెడ్డి కోరారు.