మెదక్‌లో ఒక్కరోజే 24 కరోనా కేసులు
మెదక్‌లో కరోనా కేసులు కట్టడి కావడం లేదు. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో 24 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలోని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పినా ప్రజలు కొన్ని చోట్లు పెడచేవిన పెడుతున్నారు. ఇనాళ్లు కరోనా వ్యాప్తి ఒక రకం, ఇక నుంచి మరో రకం అంటూ వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేస్తే పాజిటివ్ అని తేలుతున్నాయి. ఇక నుంచి అయినా ప్రజలు అధికారులు చెప్పిన మాటలు వినాలని వారు చెప్పిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా కేసులతో అతలకుతలంగా మారిన మెదక్…. ఒక్కరోజే ఇన్ని కేసులు రావడం పట్ల భవిష్యత్తులో మరిన్ని కేసులు అయ్యో అవకాశం ఉందంటున్నారు.