ప్లాస్మా దానం చేసి కరోనా బాధితులను కాపాడండి : భాస్కర్‌రావు
కరోనా వచ్చి కోలుకున్న వారు వారి ప్లాస్మాను దానం చేసి కరోనాతో పోరాడుతున్న ప్రాణాలకు కాపాడాలని కిమ్స్ ఎండీ భాస్కర్‌రావు కోరారు. ప్లాస్మా దానం దాని ప్రాముఖ్యతపైన ఆయన మంగళవారం కిమ్స్ ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో డాక్టర్ శరత్‌చంద్రమౌళితో కలిసి ఆయన మాట్లాడారు. కొవిడ్ మనం భయపడుతున్నంత జబ్బేమీ కాదు. కానీ, ఇది చాలా వేగంగా, విస్తృతంగా వ్యాపిస్తున్నందువలన మనం జాగ్రత్తగా ఉండాలి. సామాజిక దూరాన్ని పాటించకుండా, గుంపులుగా తిరగడం వలన దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
మనం పాటించవలసిన మూడు ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి:
సామాజిక దూరాన్ని పాటించడం
చేతులు తరచూ శుభ్రపరచుకుంటూ ఉండడం
తుమ్మేడప్పుడు లేదా దగ్గేడప్పుడు ముక్కుకి నోటికి ఏమైనా అడ్డు పెట్టుకోవడం, ఎల్లప్పుడూ మాస్క్ ధరించడం
మిగతా రోగాలలోలాగా దీనిలో మృతుల సంఖ్య ఎక్కువగా లేదు. కానీ, ఇది విస్తరించే తీరు వల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కొవిడ్ సోకినా కూడా, కోలుకోవడానికి 95-96 శాతం అవకాశాలు ఉన్నాయి. 70-80 శాతం కేసులు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటున్నాయి. వీటికి హాస్పటల్‌కి రావలసిన అవసరం ఉండదు.
ఒకవేళ లక్షణాలు ఏవైనా ఉండి పాజిటివ్ అని తేలితే ఈ జాగ్రత్తలు పాటించాలి:
ఇంట్లోనే విడిగా ఉండడం.
బోర్లా పడుకోవటం.
ఊపిరితిత్తుల వ్యాయామాలు చేయడం, ప్రాణాయామం చేయడం.
మందులు వేసుకోవడం.
విటమిన్ సీ, డీ, ఈ, జింక్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం.
సరిపడగా నీరు తాగుతూ ఉండడం.
ఒకవేళ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతున్నా, రెస్పిరేటరీ రేట్ పెరుగుతున్నా, లక్షణాలు ఏవైనా కనిపించినా, క్యాన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు, రక్తపోటు, హృద్రోగాలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పటల్‌కి తీసుకురావడం మంచిది.
ఎన్నో థెరపీలు కనుగొంటున్నారు. వీటిలో ప్లాస్మా థెరపీ విజయవంతమైనది.
వేరే మందులకంటే, వెంటిలేటర్ కంటే కూడా దీనితో చాలా త్వరగా కోలుకుంటున్నారు. కోలుకున్నవారు ముందుకి వచ్చి ప్లాస్మాని దానం చేసి మిగతావారి ప్రాణాలు కాపాడాలి. ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది ముందుకి వచ్చి ప్లాస్మా దానం చేయవలసిందిగా కోరుతున్నాను. మేము ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ అనుసరిస్తున్నాము. ప్లాస్మా దానం చేయాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఇవి మేము చూసుకుంటాము. ఒకవేళ, మీరు అర్హులయ్యి, దానం చేయడానికి ముందుకొస్తే ఎంతో లాభదాయకమవుతుంది. ఇదే ఇవాళ్టి ముఖ్యమైన అంశం. చాలా మంది ముందుకి రావట్లేదు కానీ, రావల్సిందిగా కోరుతున్నాను. దాతలు ఎదుర్కొనే ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే, రెండు సార్లు హాఅపటల్‌కి రావల్సి ఉండడం. ఒకవేళ దాతలు ముందుకొస్తే, పరీక్షలు చేయడానికి మేమే లాబ్ టెక్నీషియన్‌ని ఇంటికి పంపిస్తాము. ఒకవేళ మీరు అర్హులైతే, ట్రాన్స్‌ఫ్యూజన్ చేసే సమయంలో మాత్రమే మీరు రావలసి ఉంటుంది. రెండవది ఏమిటంటే, మొదటి నెగటివ్ రిపోర్టు తరవాత ఇరవై ఎనిమిది రోజులకి మీరు హాస్పటల్‌కి వచ్చి రక్తం ఇవ్వడానికి వీలుపడుతుంది. మీరు మాకు కాల్ చేసి అడిగితే, మీరు రక్తం ఇవ్వచ్చా లేదా అనే విషయం చెప్తాము. ఒకవేళ ఇవ్వగలిగితే, కొన్ని పరీషలు చేస్తాము. ఆ తరువాత మీరు ట్రాన్స్‌ఫ్యూజన్‌కి ప్లాస్మా దానం చేయచ్చు. రెమిడిసివిర్, టోసిలిజం లాంటి కొన్ని అవసరమైన మందులు అటు హాస్పటల్స్‌కి కానీ ఇటు విడిగా కానీ సరిపడగా దొరకట్లేదు. ప్లాస్మా థెరపీ సరైన సమయానికి, అంటే లక్షణాలు కొద్దిగా ఉన్నప్పుడు ఇస్తే, చాలా బాగా పనిచేస్తుంది. ఖర్చు కూడా తక్కువే. పదిహేను ఇరవై వేలు మధ్యలో అవుతుంది. కానీ, మందులు దాదాపు రెండు లక్షల దాకా అవుతాయి. మందులు సరిగ్గా దొరకకుండా, ప్లాస్మా థెరపీ బాగా పనిచేస్తున్నప్పుడు, కోలుకున్నవారు ముందుకి వచ్చి ప్లాస్మా దానం చేసి మిగతా వారిని కాపాడండి. మీకు ఒంట్లో బాలేనప్పుడు మీరు ఎంతో బాధపడి ఉంటారు. కాబట్టి, ఇప్పుడు మీరు ముందుకి రావాలి. ఎన్నో వేలమంది కోలుకున్నారు. మీరందరూ ముందుకి వచ్చి మిగతావారి ప్రాణాలు కాపాడాలి. మీకు జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తల నొప్పి, గాస్ లాంటి లక్షణాలు ఏవైనా కనిపించినప్పుడే మీరు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే, కావలసినన్ని కిట్లు లేవు. అవసరమైన వారికి కిట్లు ఉండాలి కాబట్టి మీకు లక్షణాలు ఉంటేనే పరీక్ష చేయించుకోండి. మీరు ఏమీ భయపడవలసిన పని లేదు. 95-98 శాతం మంది కోలుకుంటున్నారు. 80-85 శాతం లక్షణాలు ఉండట్లేదు.
రుమటాలజిస్ట్ డా. శరత్ చంద్ర మౌళి మాట్లాడుతూ ఇలా అన్నారు, “కొవిడ్ పాథాలజీ మారింది. ఇది ఒక సైటోకైన్ స్టార్మ్. దీనివల్లనే పరిస్థితులు ఇంత విషమమయ్యి ఇంతమంది చనిపోతున్నారు. రుమటాలజీలో కూడా సైటోకైన్ స్టార్మ్, మాక్రోఫేజ్ యాక్టివేషన్ సి౦డ్రోమ్ ఉంటాయి.
ప్లాస్మా థెరపీ:
ఇది చాలా పురాతనమైనది. 1880 లో ఇది కనిపెట్టారు. 1950 నుంచి బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, సార్స్, మెర్స్ లాంటి ఎన్నో పాండెమిక్‌ల్లో దీన్ని విజయవంతంగా వాడగలిగారు. ఇప్పుడు మళ్లీ ఈ కన్వాలసెంట్ ప్లాస్మని ఉపయోగిస్తున్నారు.
కన్వాలసెంట్ ప్లాస్మా:
కొవిడ్ నుంచి ఇటీవల కోలుకున్నవారి రక్తంలో యాంటిబాడీలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి, ఆ రక్తం తీసుకుని అవసరమైన వారికి వాడతాము. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నది.
లాభాలు, ఏ దశలో దీన్ని వాడచ్చు:
కొన్ని రోజుల క్రితం వరకు మనకి గైడ్‌లైన్స్ లేవు. దీనివలనే ఈ అధునాతనమైన థెరపీ ఆలస్యమైంది. జులై 3 నుంచి గైడ్‌లైన్స్ వచ్చాయి. ఏ దశలో ఏ మందులు వాడాలి అనేది ఆరోగ్య శాఖవారి నుంచి వచ్చింది. వాటి ప్రకారం కన్వలసెంట్ ప్లాస్మాని మాడరేట్ కేసుల్లో వాడవచ్చు. లక్షణాలు లేకుండా, చాలా తక్కువ లక్షణాలు ఉన్న కేసులని ఇంట్లో నుంచే నయం చేసుకోవచ్చు. కానీ, మాడరేట్ కేసుల విషయంలో, సీటీలో మార్పులు, న్యూమోనియా, ఆక్సిజన్ సాచురేషన్ 95 శాతం కంటే తక్కువ ఉండడం, రెస్పిరేటరీ రేట్ 24 శాతం కంటే ఎక్కువ ఉండడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సమయంలో వైద్యం అందిస్తే, ఆ రోగి బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గైడ్‌లైన్స్ ప్రకారం, కార్టికోస్టెరాయిడ్ అయిన దెక్సామెథాసోన్ ఇంట్రావీనస్ ఇంజెక్షన్‌లు, యాంటి-సైటోకైన్ ఇంజెక్షన్‌లు, కన్వలసెంట్ ప్లాస్మా వాడాలి. ఇవి వాడితే తర్వాత దశల్లో జరిగే నష్టాన్ని ఆపవచ్చు.
ఎంత ఇవ్వాలి? ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వచ్చు? ఎప్పుడు ఇవ్వాలి?
కోలుకున్న తర్వాత ఇరవై ఎనిమిది రోజులకి ఇవ్వచ్చు. రెండు నెగటివ్ రిపోర్టులు తప్పనిసరిగా ఉండాలి. అలానే గైడ్‌లైన్స్ కూడా పాటించాలి. పద్దెనిమిదేళ్లకి పైబడి ఉండాలి, సరిపడా బరువు ఉండాలి, వేరే ఏ వ్యాధులు ఇన్ఫెక్షన్లు ఉండకూడదు. 400-800 మిల్లిలీటర్లు ఇవ్వచ్చు కానీ ప్రామాణికంగా 400-500 మిల్లీలీటర్లు ఇవ్వాలి. అదే రోజు దానినుంచి ప్లాస్మాని తీసి, మిగతా రక్తం దాత ఒంట్లోకి ఎక్కించేస్తాము. మిగిలిన పరీక్షలు చేసి, పొందేవారికి సరిపోతుందా లేదా చూసి అదే రోజు వారికి ఎక్కించచ్చు. మామూలుగా ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి ప్లాస్మా దానం చేయవచ్చు. రెండు నెలలయ్యాక యాంటిబాడీలు తగ్గుతాయి. కాబట్టి, గరిష్టంగా రెండు మూడు సార్లు దానం చేయవచ్చు. చాలా హాస్పటల్స్ హోమ్ క్వారంటైన్ కిట్లు అందిస్తున్నారు. కిమ్స్ నుంచి దాదాపు 180 మంది ఇలా కోలుకున్నారు. 500 మందిక్ వైద్యం అందించాము, వారిలో 95 శాతం మంది కోలుకున్నారు. అరవై యేళ్లకి పైబడి, ఇతర వ్యాధులు ఉన్నవారి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే ఉండాలి.
ఖర్చు గురించి భయపడవలసిన అవసరం లేదు. ఐఆర్‌డీఏ వారు మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలకి బీమా పథకాలని తీసుకొచ్చారు. వెయ్యి రూపాయలు కడితే, ఐదు లక్షల రూపాయల బీమా అందుతుంది. సరిపడగా బెడ్లు లేవని అనుకుంటున్నారు. నిజానికి సరిపడగా ఆరోగ్య భద్రతా సిబ్బంది లేరు. పెద్దగా చదువు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్వచ్చందంగా ముందుకి వచ్చి పని చేయవచ్చు. మీరు చేయలని అనుకుంటే, మేము మీకు ఒక వారం పాటు శిక్షణ అందించి వేతనాలు ఇస్తాము. సరిపడగా సిబ్బంది లేరు కాబట్టి సరిపడగా బెడ్లు అందించలేకపోతున్నాము.
ప్లాస్మా థెరపీ ఫలితాలు 24-48 గంటల్లో తెలుస్తాయి. ఏమైనా సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటే ఆపేసి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటాము. దద్దుర్లు రావడం వంటి చిన్న చిన్న రియాక్షన్‌లు ఉంటాయి. దానికి వెంటనే మందులు ఇస్తాము. 20,000 మంది ఈ ప్లాస్మ థెరపీ తీసుకున్నారు, ఎవ్వరూ చనిపోలేదని ఇటీవల ప్రచురించిన ఒక పేపర్‌లో పేర్కొన్నారు.
ప్రభుత్వం కూడా ఈ సెంట్రలైజ్డ్ ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. ఒకవేళ అది జరిగితే, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, దానికి ముందు దాతలు ఉండాలి. ఎంతో మంది కోలుకున్నవారికి మేము కాల్స్ చేస్తున్నాము కానీ వారు ఇలా దానం చేయడానికి నిరాకరిస్తున్నారు. అందుకే వారికివారుగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయవలసిందిగా కోరుతున్నాము. ముందు దశల్లోనే ప్లాస్మా ఇవ్వడం వల్ల, ఫలితాలు బాగుంటాయి.
మామూలుగా ఒకసారి 200 మిల్లిలీటర్లు ఇంకొకసారి 200 మిల్లీలీటర్లు తిసుకుంటాము. ఇలా దానం చేశాక, దాతలకి ఎలాంటి అసౌకర్యం కలగదు. మీరు అర్హులా కాదా అని చూసుకోవడానికి మేము టెక్నీషయన్లని మీ ఇంటికే పంపిస్తాము. మందుల వల్ల వచ్చిన ఫలితాలు సరిగ్గా లేవు. కానీ ఈ ప్లాస్మా వల్ల వైరస్ పూర్తిగా అంతమవుతుందు. ప్లాస్మా వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో వెయ్యికి పైగా ప్రొటీన్లు, సైటోకైన్లు, క్లాటింగ్ ఫాక్టర్లు, ఇమ్యూన్ బూస్టర్లు ఉంటాయి. కోలుకున్నవారికి కౌన్సెలింగ్ చేయడానికి కూడా స్వచ్ఛందంగా ముందుకి వచ్చేవారు కావాలి. దాతలు గ్రహీతలు కూడా సురక్షితంగా ఉంటారు. ఇప్పటి వరకు మేము పదిహేను మందికి ఇలా ఆఖరి దశల్లో ప్లాస్మా థెరపీ చేశాము. అయినప్పటికీ 75 శాతం కోలుకున్నారు. దానం చేసినా కూడా మీ యాంటిబాడీలు తఫ్ఫవు, మీకు మళ్లీ కొవిడ్ సోకదు. మన ఇమ్యూన్ సిస్టం దానికదే యాంటిబాడీలు తయారు చేసుకుంటుంది.
ఇది భయపడవలసిన విషయం కాదు, మీరు అనవసరంగా పరీక్ష చేయించుకోకండి. ఇతర వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్మా థెరపీ వల్ల రోగులు కోలుకోవడం చాలా త్వరగా జరుగుతుంది కాబట్టి, దాతలు ముందుకి రావాలి. అందరూ కొవిడ్ బీమా తిసుకోవాలి. కరోనా రోగులను చూసుకోవడానికి వాలంటీర్లు రావాలి అనుకుంటే, మీకు వారం రోజులు శిక్షణ ఇస్తాము. దీనివల్ల బెడ్లు పెరుగుతాయి. సిబ్బంది లేనందువల్లనే సరిపడగా బెడ్లు ఇవ్వలేకపోతున్నాము.