ఆలా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతాం: తిరుపతి యాదవ్
స్వరాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని తెలంగాణ యువ నాయకుడు తిరుపతి యాదవ్ అన్నారు. విపక్షాలు అనవసర రాద్దాంతం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. త్వరలో హైకోర్టు నుంచి ప్రభుత్వంకి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సొరంగాలు, గప్తనిధులు, వాస్తు, కేటీఆర్ ని సీఎం చేయడానికి పాత సచివాలయాన్ని కూల్చతున్నారు అని పొంతనలేని మాటాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకనైన వారు తమ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని సూచించారు. అంతేకానీ అక్కసుతో ప్రభుత్వంపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని తిరుపతి యాదవ్ హెచ్చరించారు.