పది కేజీల బరువు గల ఆరేళ్ల పాప ప్యాంక్రియాటైటిస్ కు అరుదైన చికిత్స.
రాయలసీమలోనే మొదటిసారి రాయలసీమ ప్రాంతంలోనే ఆరేళ్ల పాపాకు అరుదైన చికిత్స చేసింది కిమ్స్ కర్నూలు హాస్పిటల్. శస్త్రచికిత్ప ద్వారా కాకుండా అధునాతన ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆరేళ్ల పాపా చాలా రోజులుగా ప్యాంక్రియాటైటిస్ వ్యాధితో బాధపడుతోంది. దీంతో వారు పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగితే ప్యాంక్రియాస్ మరియు ప్యాంక్రియాస్ చుట్టూ చీము గడ్డలు ఏర్పడ్డాయనివాటికి ఆపరేషన్ అవసరం అని తెలియజేశారు. చివరికి కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకవచ్చారు. అయితే అపరేషన్ లేకుండా ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలాజిస్ట్ డాక్టర్ ఎల్.రాజేంద్రప్రసాద్ ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేసి పాపా ప్రాణాలుకాపాడారు. ఈ కేసు గురించి డాక్టర్ ఎల్. రాజేంద్రప్రసాద్ గ్యాస్ట్రో ఎంట్రాలాజిస్ట్ మాట్లాడుతూ ఇలాంటి జబ్బు అరుదుగా పిల్లలు మరియు యువకులలో సంవత్సరానికి ప్రతి రెండు లక్షల మందిలో ఒకరికి సంభవిస్తుందని తెలిపారు. ఆరు సంవత్సరాల పాపాకి ఈఆర్‌సీపీ (అధునాతన ఎండోస్కోపీ చికిత్స) చేసి ప్యాంక్రియాస్ సమస్యలు పరిష్కరించటం రాయలసీమలో ఇదే మొదటిసారి పేర్కొన్నారు. చికిత్స చేసిన సమయంలో పాపా బరువు 10 కేజీలు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఈ చికిత్స చేసే ముందు ఈఆర్‌సీపీ గురించి వారి తల్లిదండ్రులకి పూర్తిగా వివరించామని తెలిపారు. తర్వాత పాపాకి ఈఆర్‌సీపీ (అధునాతనఎండోస్కోపీ చికిత్స) చేసి ప్యాంక్రియాస్ నాళంలోస్టెంట్ అమర్చామని తెలిపారు. వారం రోజులలో పాపా ఆరోగ్యం చాలామెరుగు పడిందని తెలిపారు. రెండు వారాల తరువాత సిటీ స్కాన్ చేయగా వ్యాధి పూర్తిగానయం అయినట్లు నిర్ధారించామని పేర్కొన్నారు. ఈ చికిత్స చేయకపోతే పాపా ప్రాణాలకే ప్రమాదం ఉండేదని పేర్కొన్నారు. ఒకవేళ అపరేషన్ చేసినట్లుఅయితే దీర్ఘకాలికంగా ఆసుపత్రిలోనే ఉండాల్సివచ్చేదని అన్నారు. పాపా ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు