రహస్య సోరంగాల కోసమే కూల్చుతున్నారా? : రాజశేఖర్‌రెడ్డి
వందేళ్లపైగా చరిత్ర కలిగిన సచివాలయా సముదాయాన్ని ఎందుకు కూల్చుతున్నారో.. దాని వెనక ఉన్న మర్మం ఏంటో ప్రజలకు చెప్పాలని మెదక్ జిల్లా తెజస యువజన అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో మంది సీఎంలు పరిపాలన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపిన చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. తన స్వంత చరిత్ర నిర్మాణం కోసం గతంలో యాదగిగుట్ట మీద ఉన్న దేవాలయం పిల్లర్లపై ఆయన బొమ్మలు ముద్రించుకున్న సీఎం ఇప్పుడు మరో చరిత్రను నేల కూల్చడం సరైంది కాదని హితవు పలికారు. సచివాలయం చూట్టూ ఉన్న బిర్లామందిర్, విద్యారణ్య, హోంసైన్స్ కాలేజీలలో బయటపడ్డ రహస్య సోరంగాల కోసం సచివాలయంలోని జీ బ్లాక్‌ని కూలుస్తున్నారా అని ప్రశ్నించారు. నా అంతా గొప్ప హిందువు లేడని చెప్పుకునే ఆయన నల్లపోచ్చమ్మ దేవాలయాన్ని ఎలా కూల్చరాని మండిపడ్డారు. కరోన సమయంలో ప్రజల సమస్యలు గాలికొదిలేసి భవనాలు ఎందుకు కూలగొడుతున్నారో ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తూ… కొడుకును సీఎం చేయడమే ఆయన ఉన్న ఏకైక లక్ష్యమని విమర్శించారు. ప్రజల సొమ్మును వృద్ధా చేస్తే ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని రాజశేఖర్‌రెడ్డి జోస్యం చెప్పారు.