గూగుల్ ప్లే స్టోర్‌లో 25+ మిలియన్ డౌన్‌లోడ్‌లను చేరుకున్న భారతీయ వీడియో యాప్ – మిత్రోన్
- 85 రోజుల్లో మిత్రోన్ యాప్‌లో మొత్తం 25+ మిలియన్ డౌన్‌లోడ్‌లు
- గంటకు 40 మిలియన్ వీడియోల వీక్షణలు
- ఈ యాప్ లో రోజుకు దాదాపు 1 మిలియన్ కొత్త వీడియోలు సృష్టించబడ్డాయి
దేశీయంగా అభివృద్ధి చెందిన షార్ట్-ఫాం వీడియో యాప్ అయిన, మిత్రోన్ గూగుల్ స్టోర్‌లో 25+ మిలియన్ డౌన్‌లోడ్‌లను సాధించింది మరియు ఎక్కువ మంది విషయాంశ సృష్టికర్తలు ఈ యాప్ లో చేరడానికి వరుస కడుతున్నారు. షార్ట్-వీడియో మేకింగ్ మిత్రోన్ యాప్ భారీ వీక్షకులను కూడా సంపాదించింది, ఈ వేదికలో గంటకు 40 మిలియన్ వీడియోలు చూడబడ్డాయి.
శివాంక్ అగర్వాల్ మరియు అనీష్ ఖండేల్వాల్ ద్వారా స్థాపించబడిన మిత్రోన్ యాప్ 2020 ఏప్రిల్‌లో ప్రారంభించిన వెంటనే కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. వ్యవస్థాపకుల లక్ష్యం ఏమిటంటే, ప్రజలు తమ వినూత్నతను ప్రదర్శించడానికి డిజిటల్ ఎంగేజ్‌మెంట్ మరియు వినోదాన్ని తేలికపాటి హాస్యం యొక్క నేపథ్యానికి అనుగుణంగా ఆన్‌లైన్‌లో వీడియోలను పునఃచిత్రించే ఒక షార్ట్-ఫాం వీడియో యాప్ ను రూపొందించడం.
మిత్రోన్ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ శివాంక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఇలా అన్నారు, “మిత్రోన్ ప్లాట్‌ఫామ్‌లో రోజుకు దాదాపు ఒక మిలియన్ కొత్త వీడియోలు సృష్టించబడడం చాలా ఉత్సాహంగా ఉంది. లాక్ డౌన్ దశలో దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు మాత్రమే పరిమితం కావడంతో, ప్రజలు పోస్ట్ చేసిన చిన్న వీడియోల ద్వారా డిజిటల్ వినోదాన్ని అందించే వేదికను అందించడం లేదా వారి స్వంత వీడియోలను సృష్టించడం మా లక్ష్యం.”
మిత్రోన్ యొక్క డెవలపర్‌లు, డేటా గోప్యతను నిర్ధారించడమే మా ప్రాధాన్యతగా పని చేస్తున్నారు. బెంగళూరు ఆధారిత ఈ యాప్ వినియోగదారులకు వారి వీడియోలను సృష్టించడానికి, సవరించడానికి మరియు పంచుకునేందుకు సులభమైన మరియు అవరోధరహిత ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది మరియు అదే సమయంలో ప్లాట్‌ఫాం లోని అగ్ర వీడియోల లైబ్రరీ ద్వారా బ్రౌజ్ చేసుకోవచ్చు.