ఆహారనాళంలోని చికెన్ బొక్కను తీసిన కిమ్స్ సవీర వైద్యులు
కిమ్స్ సవీర వైద్యులు 60 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలను కాపాడారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన కిష్టప్పఅనుకోకుండా 2 సెంటీమీటర్ల ఎముకను మింగారు. తీవ్ర ఇబ్బందులు పడ్డ అతను నాలుగు రోజుల తర్వాత అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రికి వచ్చారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణ తన బృందంతో కలిసి రోగి ప్రాణాలకు ఎటువంటి ఆపాయం లేకుండా రోగిని రక్షించారు. లాక్‌డౌన్ సమయంలో విజయవతంగా చికిత్స చేశామని డాక్టర్ తెలిపారు. ఈ కేసు గురించి డాక్టర్ కృష్ణ.వి.పి మాట్లాడుతూ గుంతకల్లు పట్టాణానికి చెందిన కిష్టప్ప ఇంట్లో చికెన్ తింటున్న సమయంలో 2 సెంటీమీర్ల పొడువు గల ఎముకను నమలకుండా అతను మింగారు. దీని వల్ల రోగికి గొంతులో నొప్పి, ఉమ్మి మింగడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి, ఒక్కొక్క సారి మాట్లాడడానికి రాకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కిమ్స్ సవీరకి జూన్ 23న తీసుకొచ్చిన సమయంలో కూడా అతను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. స్కానింగ్ చేసిన తర్వాత అతని ఆహార నాళంలో 2 సెంటీమీటర్ల పొడువు గల చికెన్ ఎముకను గుర్తించినట్లు తెలిపారు. అయితే ఈ కేసులు కనిపించేంత సులభం కాదన్నారు. అన్నవాహికలో ఇరుక్కున్న ఎముకను తొలిగించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదన్నారు. అలాగే ఇన్ఫెషన్స్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఎముకను తీయడానికి అతని నోటి ద్వారా గొంతులోకి ఎండోస్కోపిక్ ట్యూబ్ చొప్పించి ఎముకను తొలగించారు. ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. జూన్ 25వ తేదీన డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
చికెన్ తినడానికి డాక్టర్ తెలిపిన చిట్కాలు
- చికెన్ లేదా మాంసం తినేముందు ప్రతి ముక్కను జాగ్రత్తగా నమిలి మింగాలి
- ముక్కకు ఉన్న మాంసాన్ని చూసి తినాలి
- భోజనానికి ఎక్కువ సమయం కేటాయించాలి
- తొందర తొందరగా ఏ ఆహారం తినవద్దు
- గొంతులో ఏమైన ఇరుక్కునప్పుడు జాగ్రత్తగా ఉండాలి
- గొంతునొప్పి, ఉమ్మిమింగడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి
- ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం
చికెన్ , మాంసం ఎముకలు మింగినప్పుడు కనిపించే లక్షణాలు - తీవ్రమైన గొంతునొప్పి
- మాట్లాడడంలో ఇబ్బంది
- ఉమ్మి మింగడంలో కూడా ఇబ్బంది