మంత్రులు మాట్లాడే మాటా‌లా అవి : తెజ‌స

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌ని కాపాడ‌డానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక‌రిని మించి ఒక‌రు తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం నీళ్లు అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోన్న కేసీఆర్‌ని కాపాడ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అన్నారు. కాలువ‌లు, చెరువుల‌ను గండ్లు ప‌డ‌క‌పోతే… మ‌నుషుల‌కు గండ్లు ప‌డుతాయా అంటూ మంత్రులు స్థాయి దిగ‌జారి మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. ఎమ్మెల్యేలు కూడా రైతుల బాధ‌లు ప‌ట్టించుకోకుండా స‌ర్కార్‌ని బ‌ద్నాం కాకుండా కాపాడ‌డానికి మాత్ర‌మే ముందున్నార‌ని అన్నారు. కాళేశ్వ‌రం నీళ్లు ఎన్ని ఇస్తున్నారో… ఎన్ని ల‌క్ష‌ల పంట‌లు పండిస్తున్నారో అన్ని రైతుల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.