తెలంగాణ‌లో ఒక్క‌రోజే అన్ని కేసులా వామ్మో

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 87.6 శాతం కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 20,462కు చేరింది. ఇందులో 9,984 మంది చికిత్స పొందుతున్నారు. 10,195 మంది కోలుకున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 8 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 283కు చేరింది.
కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 1,658 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. శుక్రవారం నమోదైన కేసుల్లో ఏకంగా 87.6 శాతం ఇక్కడే నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌లో 44, వరంగల్‌ రూరల్‌లో 41, సంగారెడ్డిలో 20, నల్లగొండలో 13, మహబూబ్‌నగర్‌లో 12, మహబుబాబాద్‌లో 7, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో 6 చొప్పున, వనపర్తిలో 5, భద్రాద్రి కొత్తగుడెంలో 4, మెదక్, సిద్దిపేట, నిజామాబద్‌లో మూడు చొప్పున, ఖమ్మం, నిర్మల్‌ జిల్లాల్లో రెండు చొప్పున, కరీంనగర్, గద్వాల, ములుగు, వరంగల్‌ అర్బన్, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.