నూతన బ్రాండ్ గుర్తింపుని విడుదల చేసిన ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్

నూతన లోగో మరియు ట్యాగ్ లైన్ విడుదల

• డిజిటలైజ్డ్ మరియు ఫ్యూచర్ రెడీ సేవా పద్దతికి సూచన ఇచ్చింది
• ఒక దశాబ్ద కాల ప్రయాణం అనంతరం ఒక కొత్త మైల్ స్టోన్ ఎస్.బి.ఐ.జి2.0 వెర్షన్ తీసుకొచ్చింది.
• జన సమూహాన్ని ఆకర్షించి, ఎస్.బి.ఐ.జి లో విశ్వాసం మరియు భద్రతను సుదృఢపరుస్తుంది.

ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ (ఎస్.బి.ఐ.జి) నేడు నూతనంగా డిజైన్ చేసిన లోగో మరియు ట్యాగ్ లైన్ ‘భద్రత మరియు విశ్వాసం రెండూ’ తో తమ నూతన కార్పొరేట్ బ్రాండ్ గుర్తింపు ప్రారంభాన్ని ప్రకటించింది.డిజిటలైజేషన్ ఎల్లప్పుడు ఎస్.బి.ఐ.జి లో ఒక ప్రధాన అంశం, కాబట్టి, ఈ దశలో కంపెనీ స్వైప్ చేయదగిన మరియు ప్రెష్ లోగో తో తమ నూతన బ్రాండ్ గుర్తింపు పై సునిశిత దృష్టి మరియు స్ట్రాటజీ రెంటినీ సమ్మేళనం చేసింది.
ఈ నూతన పర్పల్ రంగు లోగో, భారత దేశం అంతటా వ్యాపించి ఉన్న తమ సాంప్రదాయ మరియు ఆధునిక ఖాతాదారులకు సేవలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎస్.బి.ఐ.జియొక్క భవిష్య సంసిద్ధతను తెలియజేస్తుంది. సాంప్రదాయ ఖాతాదారులు అంటే విశ్వాసం, నిజాయితీ, డబ్బుకు విలువ మరియు అఖండతకు విలువలు ఇచ్చేవారు, ఆధునిక ఖాతాదారులు అంటే ఫ్లెక్సిబిలిటీ మరియు భవిష్య సంసిద్ధతకు ప్రాధాన్యత ఇచ్చేవారు. పర్పల్ (వంగపండు) రంగు యవ్వన సామర్థ్యం, బుద్ధికుశలత మరియు సమర్పితభావం తెలియజేస్తుంది.
శ్రీ దినేష్ కుమార్ ఖారా,మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ బ్యాంకింగ్ &సబ్సిడరీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా అన్నారు,“మేము భారతదేశంలోని అనేకమంది జీవితాలను అనేక విధాలుగా స్పృశిస్తూ ఉన్నాం, మా వ్యాపారం కేవలం బ్యాంకింగ్ మాత్రమే కాక మరింత ఎక్కువ అనిఎస్.బి.ఐ నుండి మేము ఎల్లప్పుడు భావిస్తూ ఉన్నాము.జాతి నిర్మాణానికి మా నిబద్ధత పరిపూర్ణమైనది మరియు అవగాహన కలిగినది.
నూతన బ్రాండ్ గుర్తింపుతో ఎస్.బి.ఐజనరల్సరికొత్త విధానాలు కనిపెడుతున్నదని, జాతి ఇన్సూరెన్స్ కి మా సహాయాన్ని అందిస్తూ,మా విశ్వాసపరంపరను మరింత ముందుకు తీసుకుపోతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అభివృద్ధిపర్చిన డిజిటల్ సామర్థ్యాలతో, ఇది మా అభిమానులకు సేవలు అందించుటకు మెరుగైన విధంగా మారింది, కాబట్టి సకారాత్మక మరియు మెరుగైన ఖాతాదారు అనుభూతిని అందజేస్తూ ఇది కొనసాగుతుంది అని మేము నమ్ముతున్నాం.”
పుషాన్ మాహపాత్ర, ఎమ్.డి మరియు సి.ఇ.ఒ, ఎస్.బి.ఐ జనరల్ ఇన్యూరెన్స్ ఇలా అన్నారు, “మేముఎస్.బి.ఐ పరివారం లో చేరి ఉన్నందుకు గర్వంగా అనుభూతి చెందుతున్నాం మరియు నిజానికి, విశ్వసనీయత మరియు భద్రత యొక్క సుదృఢ పరంపరను కొనసాగించ వలసిన బాధ్యత మా మీద ఉంది.
భారతదేశంలోని ఇన్సూరెన్స్ కేటగిరీ, భయం మరియు అభద్రతాభావంతో సమస్యాత్మకంగా ఉంది. దీనికి సమాధానం చెబుతూ, “భద్రత”తో దీనికి పునరుజ్జీవనం కలిగించేందుకు, మేము ఒక ట్యాగ్ లైన్- “భద్రత, విశ్వాసం మరియు రెండూ”అని రూపొందించాము. దీనిని హిందీలో- “సురక్షా అండ్ భరోసా, దోనోం ”అని అన్నారు.
ఆయన ఇంకా ఇలా అన్నారు, “మేము మాపై ఖాతాదారులు చూపించే విశ్వాసానికి గౌరవానుభూతి చెందుతున్నాం. మా నూతన లోగో తో, మేము వారి పెరుగుతున్న సేవల అవసరాలకు అనుగుమంగా మెరుగైన సేవలు అందించగలమని పునః నొక్కి చెబుతూ. వారికి నూతన శకం ప్రాసెస్ మరియు సేవలు అందించబోతున్నాము.”
దశాబ్ద కాలం ప్రయాణంలో, 4వ సంవత్సరంలో రూ.1000 కోట్ల గ్రాస్ రిటన్ ప్రీమియమ్, జనవరి 2007 లో పోస్ట్ డి-ట్రాఫికేషన్ పరిశ్రమగా గుర్తింపు పొందుట, ఆర్థిక సంవత్సరం 18 నుండి నిరంతరంగా సమాన మరియు రిపోర్టెడ్ లాభాలు పొందుట, మరియు 2011 లో 17 శాఖలు కలిగి ఉండుట వంటి అంశాలతో ఎస్.బి.ఐ జనరల్ అనేక మైల్ స్టోన్లు దాటి వచ్చింది. ఒక దశాబ్ద కాలంగా ఎస్.బి.ఐ జనరల్ భారతదేశం అంతటా 120+ శాఖలు మరియు 253 లొకేషన్లతో తన ఉనికిని పెంచుకుంటూ ఉంది. దీని సుదృఢ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు, ఇతర ఫైనాన్సియల్ మరియు డిజిటల్ భాగస్వాముల సహకారంతో ఎస్.బి.ఐ యొక్క 22000 శాఖల నెట్ వర్క్ తో భారతదేశంలో మూలమూలలా దీని విస్తరణకు కృషి చేస్తున్నారు.
ఈ సుదృఢ మైల్ స్టోన్ల పునాదితో, నూతన ఐడెంటిటీ కూడా జతపడి, ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్, భారత దేశంలోని ప్రతి జనరల్ ఇన్సూరెన్స్ అవసరాలకు మొదటి ఎంపికగా మారుటకు త్వరత్వరగా అడుగులు వేస్తున్నది.