ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన ఆకాశ్‌ ఎడ్యూకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌

• 100% పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (AEPL)లో ఆకాశ్‌ డిజిటల్‌, మెరిట్‌నేషన్‌ ఉంటాయి. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధించేందుకు వారికి అత్యాధునిక పద్ధతిలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన లైవ్‌ టెస్ట్‌ ప్రిపరేషన్‌ క్లాసులు, లైవ్‌ ట్యూషన్స్‌తో పాటు సెల్ఫ్‌ స్టడీ మెటీరియల్‌ కూడా అందిస్తుంది.
• పరిశ్రమ దిగ్గజం నరసింహ జయకుమార్‌ను CEOగా నియమించిన AEPL

టెస్ట్‌ ప్రిపరేషన్‌ రంగంలో జాతీయస్థాయిలో అగ్రగామి సంస్థగా ఉన్న ఆకాశ్‌ ఎడ్యూకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AESL) తాను అందిస్తున్న వివిధ డిజిటల్‌ సేవలను ఒకే పరిధిలోకి తెచ్చి AESL డిజిటల్‌ ఎడ్‌టెక్‌ వ్యాపార పురోగతికి సాయపడేందుకు ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (AEPL) పేరుతో కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనేది AESLకు 100% పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా ఉంటుంది.
ఈ కొత్త అనుబంధ సంస్థలో ఆకాశ్‌ డిజిటల్‌, మెరిట్‌ నేషన్‌ వ్యాపారాలు ఉంటాయి. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధించేందుకు AEPL వారికి అత్యాధునిక పద్ధతిలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన లైవ్‌ టెస్ట్‌ ప్రిపరేషన్‌ క్లాసులు, లైవ్‌ ట్యూషన్స్‌తో పాటు సెల్ఫ్‌ స్టడీ మెటీరియల్‌ కూడా అందిస్తుంది. ఆకాశ్‌ డిజిటల్‌ సంస్థ 7 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, 2009లో ప్రారంభించిన మెరిట్‌నేషన్‌ను 2020 జనవరిలో AESL కొనుగోలు చేసింది.
ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు సందర్భంగా ఆకాశ్‌ ఎడ్యూకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AESL) డైరెక్టర్‌, CEO ఆకాశ్‌ చౌదరి మాట్లాడుతూ, “AESL డిజిటల్‌ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందేలా ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు సాయపడుతుంది. అతి పెద్ద ఆఫ్‌లైన్‌ ప్లేయర్స్‌గా ఉండటమే కాదు AESL ఇప్పుడు భారతదేశంలో ఒక పెద్ద ఆన్‌లైన్‌ లైవ్‌ ట్యూటర్‌ కూడా. కొత్త సంస్థ ఏర్పాటుతో డిజిటల్‌ చదువులపరంగానే కాదు 200 క్లాస్‌రూమ్‌ కేంద్రాలు, 2,50,000 మంది విద్యార్థులకు అందిస్తున్న ఆఫ్‌లైన్‌ బోధనలో పోటీపరంగా AESL స్థానం మరింత మెరుగుపడగలదు. “విద్యార్థులు ముందు” అన్న మా వ్యవస్థాపకుల ఆలోచనకు ప్రతిరూపమే కొత్తగా ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థ.”
AEPL డిజిటల్‌ పోర్టుఫోలియోను ముందుకు నడిపించేందుకు ఈ రంగంలో దిగ్గజంగా ఉన్న నరసింహ జయకుమార్‌ను సీఈఓగా కంపెనీ నియమించింది. 20+ సంవత్సరాల అనుభవం ఉన్న జయకుమార్‌ ఇటీవలి కాలం వరకు శుభ్‌లోన్స్‌.కామ్‌కు CBOగా బాధ్యతలు నిర్వహించారు. శుభ్‌లోన్స్‌.కామ్‌కు ముందు ఆయన ప్రముఖ హోమ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ కంపెనీ నైటింగేల్స్‌కు CEOగా ఉన్నారు. 99ఎకర్స్‌.కామ్‌ (భారతదేశపు ప్రముఖ ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌, పబ్లిక్‌ లిస్టెడ్‌ సంస్థ ఇన్ఫోఎడ్జ్‌ ఇండియా లిమిటెడ్‌, BSE:Naukriలో భాగం) సంస్థలో CBOగా, హోమ్‌షాప్‌ 18 ఈకామర్స్‌ సంస్థకు COOగా వ్యవహరించారు. అంతే కాదు గూగుల్‌, ఎక్స్‌పీడియా, గెలిలీయోలోనూ ఆయన అంతర్జాతీయ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన NIT సూరత్‌కల్‌ నుంచి బి.టెక్‌ (కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌) IIM-బెంగళూరు నుంచి PGDM, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి MBA చేశారు.
AEPL సీఈఓ నరసింహ జయకుమార్‌ మాట్లాడుతూ: “ గడిచిన దశాబ్దకాలంగా గణనీయమైన ప్రగతిని సాధిస్తున్న AESL దేశంలోనే అది పెద్ద ఎడ్యూకేషన్‌ కంపెనీగా ఎదిగింది. ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటుతో ఎడ్యూకేషన్‌ టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కించడమే కాదు కొత్త రంగాల్లో విస్తరించి తద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వాటాదారులకు దీర్ఘకాల విలువ అందించడంలో సాయపడుతుంది.”
AEPL మేనేజింగ్ డైరెక్టర్‌ పవన్‌ చౌహాన్‌ మాట్లాడుతూ, “మెరిట్‌ నేషన్‌, ఆకాశ్‌ డిజిటల్‌కు చెందిన అత్యుత్తమ, ప్రభావవంతమైన బోధన, కరికులం, కోర్సులను ఆకాశ్‌ ఎడ్యూటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒకే గొడుగు కిందకు తెస్తుంది. ఈ రెండు వేదికల విద్యా వారసత్వం, బోధన అన్నది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న K12 విద్యార్థులకు ప్రయోజనం కలిగించడమే కాదు వారు ఆన్‌లైన్‌లో నాణ్యమైన విద్యను అందుకునేలా చేస్తుంది.

JEE, NEETకు సిద్ధమవుతున్న విద్యార్థులు, 8-12 స్కూల్‌, బోర్డు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు వారు ఇంటి నుంచే సన్నద్ధమయ్యేలై ఆకాశ్‌ డిజిటల్‌ సహకరిస్తుంది. లైవ్‌ ఆన్‌లైన్ క్లాసులు, రికార్డు చేసిన వీడియో లెక్చర్లు, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్టుల ద్వారా విద్యారంగంలో తన వారసత్వాన్ని, క్రమశిక్షణను ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌ తన ఎడ్‌-టెక్‌ ఫ్లాట్‌ఫామ్‌తో అందిస్తుంది. నాణ్యమైన విద్యను పొందాలని ఆకాంక్ష కలిగి భౌగోళిక లేదా ఆర్థిక కారణాలరీత్యా పొందలేకపోతున్న విద్యార్థులకు ఇది చక్కని అవకాశం కల్పిస్తుంది.
అన్ని ప్రధాన బోర్డుల్లో K12 చదువుతున్న 2.5 కోట్ల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధనను అందించే భారతదేశపు మొట్టమొదటి ఆన్‌లైన్‌ వేదిక మెరిట్‌నేషన్‌. దేశంలోని ప్రధాన బోర్డుల్లో 1 నుంచి XII తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల బోధనా అవసరాలు తీర్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ విద్యార్థులకు వ్యక్తిగతమైన బోధనను ఇది అందిస్తుంది. మెరిట్‌నేషన్‌ లైవ్‌ క్లాస్‌ వేదిక లైవ్‌ ట్యూషన్‌ క్లాసుల ద్వారా విద్యార్థులను ఉత్తమ ఉపాధ్యాయులతో అనుసంధానం చేస్తుంది, అది కూడా సౌకర్యవంతంగా వారి ఇళ్ల నుంచి అందుకునేలా .
అక్టోబర్‌ 2019లో బ్లాక్‌స్టోన్‌ ఇంక్‌.తో AESL భాగస్వామ్యం కుదుర్చుకొని భారతదేశంలోనే అది పెద్ద ఏకీకృత డిజిటల్‌ టెస్ట్‌ ప్రిపరేషన్‌ కంపెనీని ఏర్పాటు చేసి తద్వారా 200 కేంద్రాలతో కూడిన తన బలమైన నెట్‌వర్క్‌కు చేయూత అందించి ఎదిగేందుకు డిజిటల్‌ వ్యాపారాన్ని విస్తరించింది.