చైనాలో మ‌రో వైర‌స్ ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం

చైనాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి గండం పోకముందే అది పుట్టిన దేశంలోనే మరో మహమ్మారి కోరలు చాచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఉన్న స్వైన్ ఫ్లూ వైరస్ లోనే ఇంకో కొత్త రకం వైరస్ మూలాలు డ్రాగన్ కంట్రీలో వెలుగు చూశాయి. దానిని ‘జీ4’ వైరస్ అని సైంటిస్టులు పిలుస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే దానిపై హెచ్చరిక కూడా చేసింది. ఇది పందుల ద్వారా వ్యాపించే అవ‌కాశం ఉంద‌న్నారు. ‘జీ4’ అనే వైరస్ను గుర్తించిన చైనా సైంటిస్టులు
స్వైన్ ఫ్లూలోనే కొత్త రకం వైర‌స్ పందుల నుంచి తీసుకున్న 30 వేల శాంపిళ్లపై రీసెర్చ్ 2016 నుంచి మనుషులకు సోకినట్టుగా గుర్తించారు.