ఘట్కేసర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్ వ‌ద్దు

కరోనా లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా తాము అన్ని విధాలా నష్ట పోయామని ఘట్కేసర్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో మళ్ళీ స్వచ్చందంగా లాక్ డౌన్ పెట్టడం, దానికి మున్సిపల్ శాఖ మద్దతు తెలపడంపై వ్యాపార సంఘాల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్చందంగా లాక్ డౌన్ కి తాము అనుకూలంగా లేము అని ఇవాళ ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ మరియు చెర్మైన్ కి వినతి పత్రం అందజేశారు. తమకు సడలింపులు ఇచ్చి లాక్ డౌన్ కొనసాగించాలి కోరారు. గడిచిన మూడు నెలలుగా తమ దుకాణాలకు అద్దెలు, కరెంటు బిల్లు కట్టడానికి అప్పులు చేసాము అని లేఖలో పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే తమ కుటుంబ పోషణ కరువు అయిందని ఆందోళన చేశారు. ప్రభుత్వం తమకు వేరే అనుకూలంగా సడలింపులు ఇవ్వాలని కోరారు. కరోనా కోసం ప్రతి ఒక్కరం భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ వ్యాపారాలు చేస్తున్నామని అన్నారు. ఈ సంద‌ర్భంగా శుభం రెస్టారెంట్ యాజ‌మాని రాజేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ తాము ఇటీవ‌లే రెస్టారెంట్ ఓపెన్ చేశామ‌ని, ప్ర‌భుత్వం విధించే లౌక్‌డౌన్ త‌మ‌కు స‌డ‌లింపులిచ్చి ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.