లౌక్‌డౌన్ ఇక కఠినమే
జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని అని అన్నారు సీఎం కేసీఆర్. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. లాక్ డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. నిత్యావసర సరుకులు కోనుగోళ్లు చేయడానికి వీలుగా ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి రోజంతా ఖర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని తెలిపారు. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుంది. ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలని లోతుగా పరిశీలించి అవసరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది’’ అని కేసీఆర్ వివరించారు.