ఆన్‌లైన్ క్లాస్‌లు ఆగం చేస్తున్నాయి

ఆన్‌లైన్ విద్య ఇప్పుడు అధిక ప్ర‌చారంలో ఉన్న ప‌దం. ఈ ప‌దం ధ‌నికుడికి ప‌ర్వ‌లేదు అని పించినా…పేదోడికి నాకు ఆ స్థోమ‌త లేద‌ని ప‌ట్టించుకోవ‌డం లేదు… కానీ సామాన్యుడిని భ‌యపెడుతోంది. ఇంకా 2020-21 విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కాకున్నా… క‌రోనా లౌక్‌డౌన్ వ‌ల్ల తాము ముందే ఆన్‌లైన్ విద్య ప్రారంభించామ‌ని దాదాపు అన్ని ప్రైవేట్ సంస్థ‌లు త‌మ విద్యార్ధుల త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేశారు. అందుకు కావాల్సిన ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూట‌ర్ కొనుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎక్క‌డ మా పిల్ల‌లు చ‌దువులో వెన‌క‌బడిపోతారో అనే ఉద్దేశ్యంతో త‌మ స్థోమ‌త‌కు మించి వాటిని కొనుగొలు చేశారు. ఇక్కడితో ఆగిందా అంటే కానే కాదు పాఠ‌శాల‌లకు ఫీజులు చెల్లించాలి క‌దా.. అది కూడా అప్పో స‌ప్పో చేసి స‌గం స‌గం క‌ట్టారు. అయినా స‌జావుగా పాఠాలే సాగ‌డం లేదు.
ఓ యాద‌ర్థ సంఘ‌న మీ ముందుక తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం :
క్లాస్‌లు మొద‌లైన కొన్ని రోజుల‌కే… స‌డెన్‌గా ఆన్‌లైన్ క్లాస్‌లు ఆగిపోయాయి. దీంతో ల్యాప్‌టాప్ ముందు కుర్చున్న చిన్నారి డాడీ నీవు ఫీజ్ క‌ట్ట‌లేదు అంటా అందుకే ఆన్‌లైన్ క్లాస్‌లు ఆపేశారు అని అన్న‌ది వాళ్లా నాన్న‌తో ఆ చిన్నారి. అప్పుడు ఆ తండ్రి గుండె ఒక్క‌సారి వేగంగా కొట్టుకోవ‌డం మొద‌లైంది. ఇది ఏందీ ఇంత చేసి అన్ని ఫీజులు క‌ట్టినా ఎందుకు చెప్ప‌డం లేదు అంటే ‌ మీరు ప‌ది రోజులు ఫీజు బ‌కాయి ఉంది కాబ‌ట్టే ఇప్పుడంతా… మొబైల్ ఫోన్ రీఛార్జ్‌లాగా అయిపోయింది. మీరు ఫీజ్ క‌డితే ఆన్‌లైన్‌లో మ‌ళ్లీ క్లాస్‌లు స్టార్ అవుతాయ‌ని స‌మాధానం ఇచ్చారు. దీంతో ఆ తండ్రికి ఏం చేయాలో అర్ధం కాలేదు. త‌పన ప‌డుతున్నాడు బిడ్డ‌కు ఏలా చెప్పి ఇజ్జ‌త్ కాపాడుకోవాల‌ని… అక్క‌డ ఇంట‌ర్‌నెట్ స‌రిగా రావ‌డం లేద‌ని అందుకే వాళ్లు ఆలా చెప్పారు అమ్మా అంటూ స‌మాధానం ఇచ్చాడు. ఇలా ప్ర‌తి ఇంట్లో జ‌రుగుతోంది. పాఠ‌శాల యాజ‌మాన్య‌లు త‌మ రూల్స్ పాటించాల‌ని ఒత్తిడి తెస్తున్నారు.
మ‌రోవైపు ఆన్ లైన్ క్లాసుల ఒత్తిడి తట్టుకోలేక 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో బెంగ పెట్టుకోవద్దని ఈ సమయాన్ని వారికి బతకడం ఎలాగో నేర్పించాలి. ఆన్ లైన్ క్లాసుల్లో కూడా అర్థం కాని చదువులు కాకుండా జీవితానికి పనికి చ్చేవి నేర్పేలా స్కూల్స్ సిలబస్ డిజైన్ చేయాలి. ఆన్‌లైన్ పాఠాలు విన‌డం ద్వారా పిల్ల‌ల‌కు మెడ నొప్పులు, కంటి చూపు, వినికిడి లోపాలు వ‌స్తున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటే ప్ర‌భుత్వం ఇంకా నూత‌న విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కాలేద‌ని చెబ‌తోంది. ఎవ‌రైన నిబంధ‌న‌లు అతిక్ర‌మించి ఆన్‌లైన్‌లో క్లాస్ చెబితే ఆయా విద్యా సంస్థ‌లకు తాళాలు వేయ‌డం ఖాయ‌ని హెచ్చ‌రించింది.