క‌డుపునొప్పి అని వెళ్తే… ఆమె…. అత‌డ‌య్యాడు !

ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. క‌డుపునొప్పి ‌బాధ‌ప‌డుతూ చికిత్స కోసం ఆసుప‌త్రికి వెళ్లిన ఆమెకు.. ఆమె “ఆమె కాదు.. అత‌డు” అన్న షాకింగ్ నిజం తెలిసింది. ఆ వ్య‌క్తికి చికిత్స చేసిన డాక్ట‌ర్లు.. ఆసుప‌త్రిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఆమె టెస్టిక్యులర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న‌ద‌ని.. దీంతో ఆమె అతడుగా నిర్ధారించామ‌ని తెలిపారు.
వివ‌రాల్లోకి వెళితే… కోల్‌క‌తాలోని బీర్‌భ‌మ్‌కు చెందిన 30 ఏళ్ల మ‌హిళకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్ల‌యింది. ఆ దంప‌తుల‌కు పిల్లలు లేరు. అయితే కొద్ది నెల‌ల క్రితం ఆ మ‌హిళ క‌డుపు నొప్పితో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ క్యాన్స‌ర్ ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెను ప‌రీక్షించ‌గా.. ఆమెకు గర్భ సంచి లేదని నిర్ధారించారు. అంతేకాదు పురుషుల్లో కనిపించే టెస్టిక్యులర్ క్యాన్సర్ ఆ మహిళలో గుర్తించారు. దీంతో ఆమె అత‌డన్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకున్న ఆ మ‌హిళ‌ సోదరి కూడా పరీక్షలు చేయించుకోగా.. డాక్ట‌ర్లు ఆమెకు ‘ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్’ ఉన్నట్లు గుర్తించారు. ఆమె కూడా చూసేందుకు మహిళలానే ఉన్నా పురుషుల అవయవాలతో పుట్టిందని డాక్ట‌ర్లు తెలిపారు.
ఈ విష‌యమై ఆమెను ప‌రీక్షించిన డాక్టర్ దత్త మాట్లాడుతూ.. ‘చూడ‌టానికి ఆమె వందశాతం మ‌హిళ‌లాగే క‌నిపిస్తుంది. గొంతుతో పాటు అన్ని అవ‌య‌వాలు అమ్మాయిలానే ఉంటాయి. మ‌హిళ‌ల శ‌రీరంలో ఉండే అన్ని హార్మోన్లు ఉన్నాయి. వీటివ‌ల్లే ఆమెకు స్త్రీ రూపం వ‌చ్చింది. అయితే ఆమెలో పుట్టుక‌తోనే గ‌ర్భాశ‌యం, అండాశ‌యం లేవు. దీంతో స‌ద‌రు మ‌హిళ‌కు ఇప్ప‌టికీ రుతుస్రావం జ‌ర‌గ‌లేదు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. 22 వేల మందిలో ఒక్క‌రికి ఇలా జ‌రుగుతుంది’ అని వెల్లడించారు. ప్ర‌స్తుతం ఆమెకు కీమోథెర‌పీ చేస్తున్నామ‌ని.. ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలిపారు.
ఈ విషయమై ఆమెకు, ఆమె భర్త‌కు కౌన్సెలింగ్ ఇచ్చామ‌న్నారు డాక్టర్ దత్త. ఆ మ‌హిళ చిన్నప్పటి నుంచే ఆడపిల్లలా పెరిగిందని అందరిలానే వివాహం చేసుకుందని చెప్పారు. కొత్త‌గా బయటప‌డిన ఈ విష‌యం వ‌ల్ల‌ ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఇద్దరూ ఎలా అయితే జీవితం గడిపారో ఇకముందు కూడా అలాంటి జీవితమే గడపాలని భార్యాభర్తలిద్దరికీ సూచించారు. వీరికి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆ మహిళలో గర్భసంచి లేకపోవడమే అని స్పష్టం చేశారు. అయితే ఇలా జరగడం జన్యువు లోపమే అని చెప్పారు.