తెలంగాణలో 10 వేలు దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. తాజాగా 891 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిస్చార్జ్ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 225కి పెరిగింది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 719 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 55, కొత్తగూడెం జిల్లాలో 6, ఖమ్మం జిల్లాలో 4, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో మూడు చొప్పున, సంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రెండు చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట్, నిజామాబాద్, మహబుబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 4,069 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,178 మందికి నెగిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 67,318 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 15.51శాతం మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.