ఈ టైంలో ఎమ్మెల్యేలకు గిఫ్ట్ కుపన్లా ?
అసలే వారు ఎమ్మెల్యేలు ఏం కావాలన్నా.. క్షణాల్లో కొనుకుంటారు. కానీ ప్రభుత్వం దగ్గర పైసలు లేవంటూ… చెబుతున్న సమయంలో వారికి లక్ష రూపాలయల గిఫ్ట్ కుపన్లూ ఇవ్వడం ఏంటీ అని అందరు విస్మయానికి గురవుతున్నారు. ఓ వైపు రాష్ట్ర ఖజనాలో చిల్లి గవ్వలేదు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేము అని సగం జీతం కట్ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మాత్రం లక్ష గిఫ్ట్ కుపన్లు ఎందుకు ఇచ్చింది అనేది ప్రశ్నార్థాకంగా మారింది. ఈ గిఫ్ట్ కుపన్లు కథ ఎంటో తెలసుకోవాలి అంటే ఈ వార్తను పూర్తిగా చదవండి.
లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదంటున్న ప్రభుత్వం.. అనవసర ఖర్చులను మాత్రం తగ్గించుకోవడం లేదు. కరోనా కష్టకాలంలో కరోనా టైమ్‌లో ఎమ్మెల్యేలకు గిఫ్ట్ కూపన్లుచేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు బడ్జెట్ సెషన్ గిఫ్టుగా రూ. లక్ష విలువైన కూపన్లను అధికారులు అందించారు. ఇందుకోసం ఆర్థిక శాఖ రూ.1.60 కోట్లు కేటాయించింది. ఈ కూపన్లతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షో రూంలో రూ.లక్ష విలువైన వస్తువులను కొనొచ్చు. కరోనా వల్ల ఈ సారి బడ్జెట్ సమావేశాలను కుదించి మార్చి 16న సభను వాయిదా వేశారు. అప్పుడే గిఫ్ట్ కూపన్లు పంచాలని ఆర్థిక శాఖ భావించింది. అదే టైమ్‌లో కరోనా కట్టడితో యంత్రాంగం హడావుడి, తర్వాత లాక్ డౌన్ రావడంతో కూపన్ల పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల లాక్ డౌన్ సడలించడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆర్థిక శాఖ గిఫ్ట్ కూపన్లను పంపిణీ చేసింది.
లాక్ డౌన్ సడలించడంతో కొనుగోళ్లు
లాక్ డౌన్ సడలించడంతో హైదరాబాద్ కు వచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆ కూపన్లను తమ వ్యక్తిగత సిబ్బందికిచ్చి షో రూమ్‌లకు పంపి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే తన భార్యకు యాపిల్ ఫోన్ కొనివ్వాలని గన్‌మన్‌కు కూపన్ ఇచ్చి షో రూమ్‌కు పంపారు. కావాల్సిన మోడల్ లేకపోవడంతో ఆ మోడల్ వచ్చేవరకు కూపన్‌ను జాగ్రత్త చేసుకుని ఇటీవలే ఫోన్ కొన్నట్టు తెలిసింది.