పతంజలి మందులను అడ్డుకున్న కేంద్రం
యోగా గురు రామ్ దేవ్ బాబా కు కేంద్రం షాకిచ్చింది. ఈరోజు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను విడుదల చేసింది. అయితే ఆ విడుదలకు సంబంధించి ప్రకటనలు నిలిపివేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు పతంజలి సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ లో ఎలాంటి ఔషాదాన్ని వాడారో..ఎంత మొత్తంలో వాడారో చెప్పాలంటూ ఆయుష్ శాఖ ఆదేశించింది. ప్రోటోకాల్, నమూనా పరిమాణం, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్ , క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ వివరాలు, వ్యాక్సిన్ రీసెర్చ్ డేటాను పరిశీలించే వరకు వ్యాక్సిన్ పై ఎటువంటి ప్రకటనలు, ప్రచారాల్ని నిలిపివేయాలని సూచించింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం, 1954 లోని నిబంధనలు మరియు కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఆయుర్వేద మందులతో సహా డ్రగ్స్ పై ప్రకటనలు నియంత్రించబడుతున్నాయని పతంజలికి సమాచారం అందించామని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.