తీపి కబురు ఎక్కడికి పోయింది సీఎం : రాజశేఖర్‌రెడ్డి
తెలంగాణ రైతులకు తీపి కబురు చెప్పడానికి సీఎంకి ఇంకా వారం రోజులు కాలేదా అని ప్రశ్నించారు మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి. ‘‘తెలంగాణ రైతులకు వారంలో అతిపెద్ద తీపి కబురు చెప్పబోతున్న. దేశమే ఆశ్చర్యపడే, అడ్డంపడే వార్త అది. ఆ ఫైనాన్స్అంతా వర్క్అవుట్ అయింది” ఇదీ కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మే 29న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన. ఆ ప్రకటన చేసిన వారం కాదు.. మూడు వారాలు దాటిపోయింది. ఇంత వరకూ ఆ తీపి కబురు ఊసే లేదు. సాగు పనులు మొదలు పెట్టిన రైతులు సీఎం చెప్పే తీపి కబురు ఏమిటని ఎదురు చూస్తూనే ఉన్నారు. అసలు ఆ ముచ్చట ఏందో, ఆ స్కీం ఏందో.. మంత్రులు, ఆఫీసరకు కూడా అంతు పట్టడం లేదన్నారు.
రైతులను డైవర్ట్ చేయడం కోసమే
చెప్పిన పంటను వేయకుంటే రైతు బంధు పైసలు ఇవ్వబోమని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారన్నారు. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత కొత్త వ్యవసాయ విధానంపై మాత్రమే మాట్లాడారు తప్ప రైతుబంధు సాయం ఇవ్వబోమనే విషయాన్ని చెప్పడం మానేశారు. రైతుల్లో ఏర్పడ్డ నెగెటివ్ ఫీలింగ్ పోగొట్టే ఉద్దేశంతోనే ఆయన ‘తీపి కబురు’ అస్త్రాన్ని ప్రయోగించరని రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైన రైంతాన్ని ఆదుకోవాలని కోరారు.