రైతుల కష్టాలు తీరడానికే నిధులు విడుదల : తిరుపతి యాదవ్
తెలంగాణ రైతుల కష్టాలు తీర్చడానికే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని తెరాస యువజన విభాగం నేత తిరుపతి యాదవ్ అన్నారు. 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294.53 కోట్లు ప్రభుత్వం జమ చేయడం రైతులకు చేయుతనే ఇవ్వడమేనని పేర్కొన్నారు. వానకాలం పంటలు వేయడానికి ముందస్తుగా రైతుబంధు నిధులు విడుదల చేయడంతో రైతుల తరుపున తిరుపతి యాదవ్ సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజులో రైతులకు తీపి కబురు అందిస్తారని తెలిపారు. లౌక్‌డౌన్ సమయంలో రైతులు ఇబ్బందులు పడకుడదు అనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వమే పంట కొనుగొలు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.