అందుకే వాళ్లు అందంగా ఉంటారు
ప్రపంచంలో అందరికంటే కొరియన్స్ చాలా అందంగా ఉంటారు. వారు అంత అందంగా ఉండడానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతుంటారు. అవన్నీ పక్కన పెడితే ఈ కింది చిట్కాలు పాటిస్తే కచ్చితంగా వారిలా అందంగా మారిపోతాయి. అయితే.. ఈ టిప్స్ మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ తర్వాత సులువుగా అనిపిస్తుంది.
- నిద్ర లేచిన తరువాత నీళ్ళతో ముఖం శుభ్రపరుచుకోవాలి. ఎలాంటి క్లెన్సర్లూ వాడొద్దు. నీరు మీ స్కిన్‌ను క్లీన్ చేస్తుంది.
- నీటితో ముఖం కడుక్కున్న తర్వాత టోనర్ అప్లై చేయాలి. ఈ టోనర్‌ని కాటన్ బాల్ మీద వేసి అప్లై చెయొచ్చు. లేదంటే.. మీ అరచేతులలో వేసుకుని అయినా అప్లై చెయొచ్చు. టోనర్ మీ స్కిన్ పీహెచ్ లెవెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. తరవాత వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్కిన్ అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది.
- ఈ ఎస్సెన్స్ సీరం, టోనర్, మాయిశ్చరైజర్ కలిపిన మిశ్రమం. కొరియన్ స్కిన్‌కేర్ లో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. అరచేతిలో వేసుకుని ముఖానికి అద్దాలి. వేళ్ళతో రుద్దకూడదు.
- స్కిన్ కి సరిపోయే సీరంని తీసుకోవాలి. ముడతలు, నల్ల మచ్చలు, డ్రై స్కిన్ వంటి సమస్యలని సీరం దూరం చేస్తుంది. అరచేతిలో వేసుకొని వేళ్ళతో నెమ్మదిగా ముఖమంతా అద్దాలి.
- కంటి చుట్టూ ఉండే స్కిన్ చాలా డెలికేట్‌గా ఉంటుంది. మామూలు ఫేస్ క్రీములూ, సీరంలూ ఆ ప్రదేశంలో పని చెయ్యవు. అందుకని ఐ క్రీం వాడాలి. కొంచెం ఐ క్రీం తీసుకుని మీ వేలి చివరలతో కంటి మొదలు నుంచి కంటి కొస వరకూ రాయాలి. కంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి.
- స్కిన్ టైప్‌ని బట్టి మాయిశ్చరైజర్‌ని ఎంచుకోవాలి. మాయిశ్చరైజర్ వల్లే స్కిన్‌కి గ్లో వస్తుంది. ముఖం మీద మెడ మీద మాయిశ్చరైజర్ ని మసాజ్ చేస్తున్నట్లుగా రాయాలి.
- లాస్ట్ గా అప్లై చెయ్యాల్సింది సన్ స్క్రీన్. ఇది యూవీ రేస్ నించీ, సన్ టాన్ నించీ, ముడతల నుంచి చర్మాన్ని ప్రొటెక్ట్ చెస్తుంది. కనీసం ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ ని ఎంచుకోవాలి.