రాయ‌ల్‌చెరువు అమ్మాయి కాలేజీ టాప‌ర్‌

ఒకవైపు తండ్రి మరణం మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షా సమయం దుఖంలోనూ ఓ విద్యార్థి కాలేజీ టాపర్ గా నిలిచింది. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం రాయల్ చెరువు అనే గ్రామంలో శేఖర్ రెడ్డి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనాన్ని కొనసాగించేవారు. అతనికి ఇద్దరు కూతుళ్ళు కాగా పెద్ద కూతురు అంజని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. అయితే మార్చి రెండో తారీఖున తన తండ్రి శేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మార్చి నాలుగో తారీఖు నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 3న తన తండ్రి అంత్యక్రియలు రాత్రి 7:30 సాయానికి జరిగిన ఉదయాన్నే ఎనిమిది గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకుని పట్టుదలతో పరీక్షలు రాసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కాలేజ్ టాపర్ గా నిలిచింది. బైపిసిలో 440 మార్కులకు గాను 424 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా అంతటి కష్టంలో అయినా పరీక్షల్లో టాపర్గా నిలిచిన అంజలి కాలేజీ లెక్చరర్లు, యాజమాన్యం అభినందనలు తెలిపింది.