పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : తిరుపతి యాదవ్
కేంద్ర ప్రభుత్వం రోజురోజుకీ అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ పై రోజురోజుకు పైసా పైసా పెంచుకుంటూ పోతుందని తెరాస యువనేత గద్ద తిరుపతి యాదవ్ విమర్శించారు. ఇప్పటికే కరోనతో ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే, పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ధరలు పెంచడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలను నియంత్రించే వలసిందిగా ఆయన కోరారు.