హైదరాబాద్ మరియు తెలుగు విద్యార్థులు ఆస్ట్రేలియాలో అధ్యయనం కొనసాగించడానికి ఈ రోజు నుండే వర్చువల్ స్టార్ట్ చేయవచ్చు
చార్లెస్ స్టుర్ట్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాలచే ఫేస్-టు-ఫేస్ వర్చువల్ (ఎఫ్2ఎఫ్‌వి) తో ఆన్‌లైన్‌లో ప్రారంభించండి మరియు పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత క్యాంపస్‌లో డిగ్రీ పూర్తి చేయండి
హైదరాబాద్, జూన్ 2020: కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ ఆస్ట్రేలియాలో మీ అధ్యయనాలను ఎలా ప్రారంభించాలో అని ఆందోళన చెందుతున్నారా? ఫేస్-టు-ఫేస్ వర్చువల్ (F2FV) తో విద్యార్థులు తమ భవిష్యత్తును ప్రారంభించడంలో సహాయపడటానికి చార్లెస్ స్టుర్ట్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. జూలై 2020 నుండి ప్రారంభమయ్యే కార్యక్రమాల కోసం. ప్రణాళికలు నిలిపివేయడం కంటే, విశ్వవిద్యాలయాల అధ్యయన కేంద్రాలు విద్యార్థులు తమ బ్లెండెడ్ అభ్యాస విధానంతో ఆన్‌లైన్‌లో అధ్యయనం ప్రారంభించడానికి సహాయపడతాయి, ఆస్ట్రేలియాలో, ఫేస్-టు-ఫేస్ స్టడీస్ సురక్షితం అయ్యాక మరియు సరిహద్దులు తిరిగి తెరిచినప్పుడు, డిగ్రీని యూనివర్సిటీ సెంటర్ లో పూర్తి చేయడానికి తోడ్పడుతుంది,
చార్లెస్ స్టుర్ట్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా యొక్క ప్రముఖ ఆన్‌లైన్ యూనివర్సిటీ. దేశంలోని ఇతర సంస్థల కంటే (డిపార్ట్మెంట్ అఫ్ ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ ఎంప్లాయిమెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం) ఎక్కువ మంది విద్యార్థులు యూనివర్సిటీతో ఆన్‌లైన్‌లో అధ్యయనం చేయటానికి ఎంచుకుంటారు. కాబట్టి ఆన్‌లైన్ విద్యార్థులకు ప్రతి దశలో మద్దతు ఇస్తుంది యూనివర్సిటీ.
వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆండ్రూ వాన్ అంతర్జాతీయ విద్యార్థులను ఇలా స్వాగతించారు, “చార్లెస్ స్టుర్ట్ యూనివర్సిటీ జూలైలో యూనివర్సిటీ యొక్క స్టడీ సెంటర్ లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ విద్యార్థులందరికీ ఆన్‌లైన్ ఫేస్-టు-ఫేస్ శిక్షణను అందించడం ఆనందంగా ఉంది.
ఈ బోధనా నమూనా మా విద్యార్థులకు మా సిబ్బందితో మధ్యలో స్టడీ సెంటర్ లో అందించే స్థాయి పరస్పర చర్యను అందిస్తుంది మరియు కోవిడ్-19 పరిమితుల ఫలితంగా వారు తమ అధ్యయన ప్రణాళికలను ఆలస్యం చేయనవసరం లేదు.
ఆస్ట్రేలియా యొక్క అతిపెద్ద మరియు అత్యంత అనుభవంగల ఆన్‌లైన్ యూనివర్సిటీగా, చార్లెస్ స్టుర్ట్ యూనివర్సిటీ ఆన్‌లైన్ అధ్యయనంలో అందరికంటే ముందుంది, మరియు ఈ కొత్త విద్యార్థులను వారి విద్యపై ఈ దశలో మద్దతు ఇవ్వడానికి మేము ఎదురుచూస్తున్నాము.”
విద్యార్థులకు అవసరమైన అన్ని మద్దతులు మరియు మార్గదర్శకత్వం ఉండేలా చార్లెస్ స్టర్ట్ స్టడీ సెంటర్స్ ఎఫ్2ఎఫ్‌వి బోధన విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయబడింది. ఇండియన్ స్టాండర్డ్‌తో సహా విస్తృత సమయ మండలాలకు అనుగుణంగా మధ్యాహ్నం మరియు సాయంత్రం సమయంలో ఎఫ్2ఎఫ్‌వి తరగతులు షెడ్యూల్ చేయబడతాయి. అంటే పంజాబ్, గుజరాత్, తెలంగాణ తో సహా దేశవ్యాప్తంగా విద్యార్థులు లైవ్ క్లాసులకు హాజరు కావొచ్చు. విద్యార్థులు ఆస్ట్రేలియాకు వచ్చే వరకు వారు కనెక్ట్ అయ్యేలా వర్చువల్ కరావొకే మరియు క్విజ్ నైట్స్ లతో సహా ఆన్‌లైన్ కెరీర్లు మరియు శ్రేయస్సు వర్క్‌షాప్‌లు మరియు సామాజిక కార్యక్రమాలలో కూడా వారు పాల్గొనవచ్చు.
సురక్షిత ఆస్ట్రేలియాకు విద్యార్థులను స్వాగతిస్తూన్నాము
కోవిడ్-19 యొక్క ప్రభావాన్ని మరియు వ్యాప్తిని తగ్గించడానికి ఆస్ట్రేలియా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది, ఇప్పటికే గొప్ప పురోగతి సాధించింది. చార్లెస్ స్టుర్ట్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాలు ఆస్ట్రేలియా తీరాల వెలుగుకు కొత్త విద్యార్థులను స్వాగతించగలవనే నమ్మకంతో ఉన్నది! సరిహద్దులు తెరిచిన వెంటనే, విద్యార్థులు తమ ప్రోగ్రామ్ ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాలో ప్రయాణించడానికి మరియు స్థిరపడటానికి వీసా పొందవచ్చు.
ఆస్ట్రేలియా తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాక, ఐటి నిపుణులు మరియు వ్యాపార నిపుణులకు అధిక డిమాండ్ రానున్నది. చార్లెస్ స్టుర్ట్ యూనివర్శిటీ స్టడీ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అకౌంటింగ్ మరియు బిజినెస్‌లో ఫార్వర్డ్-థింకింగ్, కెరీర్-ఫోకస్డ్ అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తుంది.