మోచేతికి బెల్లంపెట్టి నాకిస్తున్న కేసీఆర్ : రాజశేఖర్‌రెడ్డి
పూటకో మాటతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతంగాన్ని మోసం చేస్తున్నారని మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం నుండి కొండపోచ్చమ్మకి నీళ్లు తీసుకొచ్చిన నాడు వారం రోజులలో తెలంగాణ రైతులకు ఓ తీపి కబురు చెబుతానని చెప్పిన కేసీఆర్ ఆ విషయాన్నే మరిచిపోయారని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు, కరెంట్ బిల్లులు, సన్నరకం వడ్లు ఇలా మాటలు మారుస్తూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట వింటనే రైతులకు రైతుబంధు ఇస్తానన్న ఆయన ఇప్పటి వరకు ఆయా పంటలకు మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. అసలు సన్న వడ్లను భవిష్యత్తులో పండించే రైతుల పరిస్థితి ప్రశ్నార్ధకంగానే మిగిపోతదని అన్నారు. వానకాలం పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఇప్పటి వరకు అధికార ప్రకటన ఎందుకు చేయలేదని, దాని వెనుక ఉన్న మతాలబు ఏంటో చెప్పాలన్నారు. పంటలు చేతికొచ్చాకా… ప్రభుత్వం చెప్పిన ధరకే ఇవ్వాలంటే.., సన్నరకం వడ్ల మీద పెట్టుకున్న ఆశలన్ని గంగలో కలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సన్న రకం వడ్లు సొసైటీల ద్వారా కొనుగోలు చేసే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉందా అని ఆయన ప్రశ్నించారు ఈ సారి ముఖ్యమంత్రి కరోనా విషయంంలో, పంటల విషయంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రైతులకు రైతుబంధు పథకం అంంటూ మోచేతికి బెల్లంపెట్టి నాకిస్తున్నారని విమర్శించారు. రైతులు పడుతున్న కష్టాలను వదిలేసి…. కేటీఆర్ కట్టుకున్నన ఫాం హౌస్‌ల మీద దృష్టి పెడుతున్నారని దయ్యబట్టారు. ఇప్పటికైన మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాంండ్ చేశారు.