హైదరాబాద్‌లో అసలేం జరుగుతోంది ?
కరోనా సృష్టిస్తున్న ప్రళయం హైదరాబాద్ మహానగరంలో అతలాకుతలం అవుతోంది. పరిస్థితి ఇలా ఉంటే జూలై నాటికి చేయి దాటిసపోతోందని కేంద్ర బృందం హెచ్చరిస్తోంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం నగరంలో పర్యటన చేసింది. పాజిటివ్ కేసులు పెరుదలపై అధికారులతో సమావేశం జరిపింది. కరోనా పరీక్షల వివరాలు పూర్తిగా తెలుసుకుంది. 70 శాతంపైగా ప్రైవేట్ జరుపుతున్న పరీక్షల ద్వారా వస్తున్నాయని , ప్రభుత్వంం ఏం పరీక్షలు చేస్తోందని ప్రశ్నించినట్లు సమమాచారం. కరోనా వచ్చిన మొదట్లో ఎందుకు ఎక్కువగా కేసులు నమోదు కాలేవని, ఇప్పుడు రోజుకు వందకుక పైగా నమోద కావడంపై నిర్లక్ష్యం ఎవరిదని కేంద్ర బృందం ప్రశ్నించింది. ఓ వైపు వర్షాలు కురుస్తుండడం కూడా అధికారులను భయపెడుతోంది. వానాకాలం జ్వరాలకు కరోనా తోడైతే డాక్టర్లు కూడా అదుపుచేయలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఏం చేయాలనే ఆలోచనలో పడింది.