బంగారు తెలంగాణలో… కరెంటు బిల్లుల మోత ఏందీ ? : తెజస
డెక్కన్ న్యూస్, మెదక్ ప్రతినిధి శ్రీకాంత్ చారి :
కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గర అధిక కరెంట్ బిల్లులు వసూల్ చేయవద్దని మెదక్ జిల్లా తెలంగాణ జనసమితి యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.. కరోనా లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇప్పటికే కోలుకోలేని విధంగా ఇబ్బందులలో ఉన్నారని అన్నారు పేద మధ్య తరగతి ప్రజల కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలలో ఏ ఒక్క్ బిడ్డ కూడా ఇబ్బంది పడవద్దు అంటే… కరెంట్ బిల్లులు సామాన్య ప్రజలపై వేయడం సరికాదన్నారు. కేసీఆర్ కలలు కన్న తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సింది పోయి… ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం సమజసం కాదని అన్నారు.