గాంధీ నుంచి లక్షణాలు లేని కరోనా బాధితుల తరలింపు

తెలంగాణలో మరో ఐదుగురు మృతి
హైదరాబాద్‌…తెలంగాణలో ఇవాళ కొత్తగా 92 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

మరో ఐదుగురు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు.

జ్వరం, దగ్గు, జలుబు లాంటి ఎలాంటి బహిర్గత అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్న 50 ఏళ్లలోపు కొవిడ్‌-19 బాధితులను గాంధీ ఆసుపత్రి నుంచి వారి వారి ఇళ్లకు హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఇవాళ మొత్తం 393 మంది కరోనా పాజిటివ్పేషంట్లను గాంధీ నుంచి క్వారంటైన్‌కు తరలించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. తమ ఇళ్లలో ప్రత్యేక గది వసతి కలిగి ఉన్న 310 మందిని హోంక్వారంటైన్‌కు, మిగతా 83 మందిని అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించినట్లు ఆయన వివరించారు. ఇందుకు గాంధీ నుంచి ప్రత్యేక 30 అంబులెన్సులు, మూడు బస్సులు వినియోగించారు. ఇలా రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య స్థితిగతులపై పబ్లిక్హెల్త్ డిపార్ట్మెంట్వారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. బాధితులు ఒక వేళ ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే కొవిడ్‌ నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలిపి, తగిన సూచనలు, వైద్యం పొందవచ్చన్నారు