ఊపందుకున్న మార్కెట్లు; 1.13% పెరిగిన నిఫ్టీ, 306.54 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

భారతీయ స్టాక్ మార్కెట్లు, గత ట్రేడింగ్ సెషన్లో 6 రోజుల సుదీర్ఘ సానుకూల పనితీరును అధిగమించిన తరువాత, ఈ రోజు ఊపందుకున్నాయి. నిఫ్టీ-50 సూచీ 1.13% లేదా 113.05 పాయింట్లు పెరిగి 10 వేల మార్కు దాటి 10142.15 వద్ద ముగిసింది. మరోవైపు సెన్సెక్స్ 0.90% లేదా 306.54 పాయింట్లు పెరిగి 34287.24 వద్ద ముగిసింది.

నేటి వాణిజ్యంలో, 2028 షేర్లు పెరిగాయి, 131 షేర్లు మారలేదు మరియు 505 షేర్లు క్షీణించాయి. బ్యాంక్, ఆటో, ఇన్‌ఫ్రా, మెటల్ రంగాలు సానుకూలంగా ముగియడంతో బెంచిమార్కు సూచీలు పెరిగాయి.

నేటి వాణిజ్యంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్ (8.34%), టాటా మోటార్స్ (13.65%), టాటా స్టీల్ (6.17%), ఎస్‌బిఐ (8.73%), మరియు హిండాల్కో ఇండస్ట్రీస్ (5.01%) లాభాలు సాధించగా, సిప్లా (0.92%), నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వారిలో బజాజ్ ఆటో (1.36%), ఇన్ఫోసిస్ (0.42%), హెచ్‌యుఎల్ (1.58%), మరియు టిసిఎస్ (1.84%) ఉన్నాయి.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.69% పెరిగింది. పిఎస్‌యు బ్యాంక్ సూచీ 7% పెరిగింది,  లోహాల, ఇన్‌ఫ్రా, ఆటో, ఎనర్జీ రంగాలు దీనిని అనుసరించాయి.

ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరవడం గురించి పెట్టుబడిదారులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్లు అధికంగా ముగిశాయి.

ఎస్‌బిఐ

నాల్గవ త్రైమాసికంలో ఎస్‌బిఐ రూ. 3,850 కోట్ల లాభాలను ఆర్జించింది, ఆ తరువాత ఎస్‌బిఐ స్టాక్ 8.73% పెరిగి రూ. 189.25 వద్ద ముగిసింది.

సారెగామా

సారెగామా యొక్క ఏకీకృత నికర లాభం 7.1% తగ్గింది, కంపెనీ ఏకీకృత ఆదాయం 14.3% తగ్గింది. అయినప్పటికీ, ఈ స్టాక్ 10% పెరిగి మార్కెట్ ధర రూ. 441,70 వద్ద ట్రేడ్ అయింది. ఈ కంపెనీ, ఫేస్ బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు మరియు ఇతర సామాజిక అనుభవాల కోసం, దాని సంగీతానికి లైసెన్స్ ఇవ్వడానికి ఫేస్‌బుక్‌తో ప్రపంచ ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత గత రెండు రోజుల్లో కంపెనీ స్టాక్ 44% పెరిగింది.

క్యాడిలా  హెల్త్ కేర్

హెచ్‌ఐవి చికిత్సలో ఉపయోగించే ఔషధమైన అటాజనావివీర్ క్యాప్సూల్‌ను మార్కెటింగ్ చేయడానికి యుఎస్ ఎఫ్‌డిఎ అనుమతి పొందినప్పటికీ కాడిలా హెల్త్‌కేర్ షేర్లు 0.95% పడిపోయి రూ. 359.25 వద్ద ట్రేడ్ అయ్యాయి.

బ్యాంకింగ్ రంగాన్ని రీ-రేట్ చేసిన గోల్డ్మన్ సాచ్స్ 

గోల్డ్మన్ సాచ్స్ భారత బ్యాంకుల ఆదాయ దృక్పథాన్ని కోత కోసింది. బ్రోకరేజ్ సంస్థ తన దృక్పథంలో యాక్సిస్ బ్యాంక్‌ను దిగజార్చింది, అయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మరియు బంధన్ బ్యాంక్‌లకు ప్రాధాన్యత ఇచ్చింది, ఎందుకంటే భారత ఆర్థిక రంగం ఈ సంవత్సరం విస్తృత మార్కెట్‌లో పనితీరును సరిగా కొనసాగించడంలేదు.

ఆల్కెమ్ లాబొరేటరీస్ 

ఆల్కెమ్ లాబొరేటరీస్ ఏకీకృత లాభం 12.3% పెరిగి రూ. 191.5 కోట్లకు చేరుకోగా, కంపెనీ ఆదాయం 10.6% పెరిగింది. లాభాలు ఉన్నప్పటికీ, కంపెనీ స్టాక్ 2.62% పడిపోయి రూ. 2381.00 వద్ద ట్రేడ్ అయింది.

బ్రిటానియా ఇండస్ట్రీస్ 

వాడియాస్ షేర్లను విక్రయించినదనే నివేదిక అబద్ధమని కంపెనీ ప్రకటించిన తరువాత, బ్రిటానియా ఇండస్ట్రీస్ స్టాక్స్ 0.20% పెరిగి రూ. 3457.1 వద్ద ట్రేడ్ అయింది. లాక్ డౌన దశలో ఈ కంపెనీ అతిపెద్ద లబ్ధిదారునిగా వెలిసింది, ఎందుకంటే గృహాలలో బిస్కెట్ల వినియోగం పెరిగింది. బ్రిటానియా తన అమ్మకాలలో 1.5% మరియు కంపెనీ ఆదాయంలో 26% పెరుగుదలను నివేదించింది.

బంగారం

బంగారం 0.72% తగ్గి, సుమారు రూ. 330 లు తగ్గింది. బంగారం ధరలు తక్కువగా వర్తకం చేసినప్పటికీ, బంగారం యొక్క సురక్షితమైన స్వర్గ డిమాండ్‌పై కోలుకునే ఆశ ఉంది.

భారత రూపాయి 

దేశీయ ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ సెషన్ అస్థిరంగా ఉండటంతో భారత రూపాయి డాలర్‌కు రూ. 75.58 వద్ద ముగిసింది.

ప్రపంచ మార్కెట్

మునుపటి ట్రేడింగ్ సెషన్లో ప్రతికూల పనితీరును ప్రదర్శించిన యూరోపియన్ మార్కెట్లు అధికంగా వర్తకం చేశాయి. ఈరోజు ఎఫ్.టి.ఎస్.ఇ ఎం.ఐ.బి, 1.56% పెరిగింది.

పెట్టుబడిదారులలో సానుకూల మనోభావాలను ఏర్పరచే ఆర్థిక వ్యవస్థలలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రపంచ  మార్కెట్లు దూకుడు మీదున్నాయి. నిక్కీ 225, 0.74% పెరిగింది, హాంగ్ సెంగ్ 1.66% పెరిగింది. అయినప్పటికీ, ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 9817.18 పాయింట్ల వద్ద ఉన్న నాస్‌డాక్ 0.69% పడిపోయింది