ధరపల్లిలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
ధరపల్లి సర్పంచ్ సిద్దిరాంరెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి ఆదర్శమన్నారు. యావత్ దేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగువారి సొంతమని అన్నారు. వేడుకలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో మంచి పంటలు వేసి రైతులు అధిక దిగుబడులు వచ్చేలా కష్టపడాలని కోరారు. మండలంలో ఆదర్శ గ్రామంగా ధరపల్లి నిలవాలని ఆశించారు. ఇందుకోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.











