గవ్వలపల్లి యువకుడికి కరోన పాజిటివ్ కేసు
శిక్షణలోలో ఉన్న కానిస్టేబుల్లను కూడా కరోనా వదలడం లేదు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లికి చెందిన యువకుడికి కరోన పాజిటివ్‌గా వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గత కొంత కాలం కింద వచ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఆ యువకుడు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణలో భాగంగా హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆ యువకునికి జ్వరం రావడంతో స్థానిక కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా… కరోన అని తేలాగానే వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎవరూ కూడా అతన్ని కలవలేదు. గవ్వలపల్లి గ్రామ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దు అని అధికారులు తెలిపారు.











