టీడీపీలో చేరిన మొదటి మహిళా నాయకురాలు కాట్ర‌గ‌డ్డ

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎంతో మంది నాయ‌కీ, నాయ‌కులు ప్రజల మ‌ధ్య‌కు వ‌చ్చారు. రావ‌డ‌మే కాదు అన్న‌గారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్ర‌జా సేవ‌కే అంకిత‌మ‌య్యారు. ఎల్ల‌ప్పుడు ప్ర‌జాసేవ‌యే కోరుకునే కోవ‌కి చెందిన వారే ఈ కాట్ర‌డ్డ ప్ర‌సూన.
కాట్రగడ్డ ప్రసూన 1982 మర్చి 29 న టీడీపీ పార్టీలో చేరిన మొదటి మహిళా నాయకురాలు. పార్టీలో చేరినప్పుడు కాట్రగడ్డ ప్రసూన వయస్సు 24 సంవత్సరాలు. 1982 ఏప్రిల్ 11 న నిజాం కాలేజీ గ్రౌండ్ లో మొదటి పార్టీ సమావేశం జరిగింది. టీడీపీ మొదటి సమావేశం స్టేజీపై ఉన్నవారిలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు…మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాత్రమే బతికి ఉన్నారు. అందుకు ఈ ఫోటోనే సాక్ష్యం.
ఆర్థిక శాస్త్రంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఉన్నత విద్యావంతురాలైన కాట్రగడ్డ ప్రసూన 1983 ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. దేశంలోనే అతి పిన్న వయస్సులో కాట్రగడ్డ ప్రసూన ఎమ్మెల్యేగా గెలిచారు.ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
ఎన్టీఆర్ అనారోగ్యంతో అమెరికా వెళ్లి వైద్యం చేయించుకొని వచ్చాక టీడీపీ సమావేశాల్లో కాట్రగడ్డ ప్రసూన ఎన్టీఆర్ వెంటే ఉండి చేయి పట్టి నడిపించిన ధైర్య సాహసం ఉన్న నాయకురాలు. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ప్రజాస్వామిక పరిరక్షణలో కాట్రగడ్డ ప్రసూన ఎప్పుడూ ముందుంటారు. టీడీపీ పక్షాన అనర్గళంగా గొంతెత్తి మాట్లాడటంలో ఈమె నిష్ణాతురాలు.
ఇప్ప‌టికీ పార్టీని అంటిపెట్టుకొని చంద్ర‌బాబునాయుడు ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా సేవ‌కు నిమ్మ‌గ్న‌మ‌య్యారు. అనునిత్యం స్థానిక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వారికి సేవ అంకిత‌మ‌య్యారు. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు శుభాభినంద‌న‌లు తెలియ‌జేశారు. క‌రోనా వ‌ల్ల స‌మావేశం కుద‌ర‌క పోవ‌డంతో డిజిట‌ల్ మ‌హానాడు ద్వారా చంద్ర‌బాబునాయుడు అంద‌రికి అందుబాటులోకి వ‌చ్చార‌‌ని ఆమె తెలియ‌జేశారు.