ఒకినావా FY 20-21 మూడో త్రైమాసికంలో 100 శాతం ‘మేక్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ని లాంఛ్ చేయనుంది.
మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించే ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ అయిన ఒకినావా, తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ -ఒకి100ని 100% స్థానికంగా ఉత్పత్తి చేయబడుతున్నట్లుగా ప్రకటించింది. బ్రాండ్ భారతీయ ఎలక్ట్రిక్ వేహికల్ సెగ్మెంట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడి ‘‘మేక్ ఇన్ ఇండియా’’ విజన్‌ని ప్రోత్సహిస్తోంది. ఈ విజన్‌కు అనుగుణంగా, ఒకినోవా తన రాబోయే ఒకి100లో బ్యాటరీ సెల్స్ మినహా అన్ని కాంపోనెంట్‌లు కూడా భారతదేశంలో తయారుచేస్తున్నట్లుగా తెలియజేసింది.
ఎంతగానో ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బైక్-ఒకి100 గంటకు 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో కలిగి ఉంది, దీనిలో లిథియం అయాన్ బ్యాటరీ బేస్ ఉంది. బైక్ ప్రోటోటైప్ ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించబడింది, దీనిలోని సాంకేతిక నైపుణ్యం మరియు అందానికి హాజరైన వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఎలక్ట్రిక్ బైక్‌ని 2021-21 ఆర్ధిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో ఆవిష్కరిస్తోంది.
‘‘మేం ‘స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్‌ను స్వాగతిస్తున్నాం. దీనిని వేగవంతం చేయడానికి ఒకినోవా 100శాతం ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ఎలక్ట్రిక్ బైక్‌ని ప్రకటించింది. ప్రస్తుతం, ఒకినోవా గరిష్టంగా 88% లోకలైజేషన్ చేసిన ఎలక్ట్రికల్ వాహనాలను అందిస్తోంది. మా రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌తో, మేం లోకలైజేషన్ లెవల్‌ని 100%కు తీసుకెళుతున్నాం. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క అన్ని కాంపోనెంట్‌లు స్థానిక సప్లయర్‌ల ద్వారా తయారు చేయబడి, అందించబడతాయి. స్థానిక్ సప్లయర్‌ల డొమైన్‌ని బూస్ట్ చేయడానికి మరియు ఈవి స్టార్టప్‌లు అన్నింటిని కూడా ‘‘స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అనేది స్ఫూర్తిని కలిగిస్తుందని శ్రీ. జితేందర్ శర్మ-ఎమ్‌డి,ఒకినావా తెలిపారు.
బ్రాండ్ తన ఖాతాదారులకు 100 శాతం లోకలైజ్ చేయబడ్డ ఎలక్ట్రిక్ ద్వి చక్రవాహనాలను విస్త్రృత శ్రేణిని అందించాలనే ప్లాన్‌ని కలిగి ఉంది. ఒకి100 ఈ శ్రేణిలో మొదటి ఉత్పత్తి. దీనిని పూర్తి చేయడం కొరకు, బ్రాండ్ భారతదేశంలో స్థానిక సరఫరాదారుల బేస్‌ని కూడా విస్త్రృతం చేస్తోంది. ఒకినోవా, ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల శ్రేణిలో FAME 2 అప్రూవల్ అందుకున్న మొట్టమొదటి కంపెనీ,ఇది తన చర్యలు మరియు అత్యాధునిక సాంకేతికత ద్వారా ఎలక్ట్రిక్ వేహికల్ ఇండస్ట్రీలో లోకలైజేషన్ ఫ్యాక్టర్‌ని వేగవంతం చేయాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది.